ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ బలహీనపడటం మధ్య బంగారం ధరలు వరుసగా గత మూడు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. నిన్నటికి ఈ రోజుకు పోల్చుకుంటే శనివారం 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300లకుపైగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం తులం ధర 1లక్షా 470 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.200 వరకు తగ్గి ప్రస్తుతం తులం ధర రూ.92,090 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చితే తాజాగా స్వల్పంగానే తగ్గిందనే చెప్పాలి.
బంగారం ధర ఇంకా ఒక లక్ష రూపాయలు పైనే ఉంది. ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ పరిణామం కాస్త ఇబ్బంది కరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 93 వేల సమీపం వరకు చేరడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి జేబు భారం మరింత పెంచింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్!
ఇక మరోవైపు వెండి ధర కూడా ఈ రోజు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్షా 17 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలలో లక్షా 27 వరకు ఉంది. వెండి ధర కూడా రికార్డ్ స్థాయి నుంచి ఏ మాత్రం దిగడం లేదు. వెండి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా పారిశ్రామికంగా వెండి డిమాండ్ భారీగా పెరగడమే ఒక కారణమని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వెండి లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,240 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి ఎందుకు తగ్గాయి?
ధరలు తగ్గడానికి మొదటి ప్రధాన కారణం అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్‌లతో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం. దీని వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మార్కెట్లో ఉద్రిక్తత ఇప్పుడు తగ్గుతుందని, భవిష్యత్తులో యూరప్ లేదా చైనాతో అలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని భావించారు. వాతావరణం స్థిరంగా కనిపించినప్పుడు ప్రజలు బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తారు. స్టాక్ మార్కెట్ వంటి ప్రమాదకర పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. ఈ లాభాల బుకింగ్ కారణంగా, బంగారం డిమాండ్ కొద్దిగా తగ్గింది. ఇది ధరల తగ్గుదలకు దారితీసింది.
ఇది కూడా చదవండి: MG Cyberster: సింగిల్ ఛార్జింగ్‌తో 580 కి.మీ మైలేజీ.. మార్కెట్‌లో దుమ్మురేపే ఎలక్ట్రిక్ కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..