హైదరాబాఆద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో 17 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న HCA సెక్రటరీ దేవరాజ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యడు. 17 రోజులపాటు 7 రాష్ట్రాల్లో తిరిగిన దేవరాజ్‌ను పుణెలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి దేవరాజ్ కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే బస చేశాడు దేవరాజ్. హైదరాబాద్, ఏపీ, చెన్నై, బెంగళూరు, ఊటీ, గోవాలో తిరిగిన దేవరాజ్‌ను ఎట్టకేలకు పుణెలో పట్టుకున్నారు.
మరోవైపు HCA కేసులో మరో మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. HCA పర్యవేక్షణ బాధ్యతలను నవీన్‌రావుకు అప్పగించారు. రిటైర్డ్ జడ్జిగా ఉన్న నవీన్‌రావును HCA బాధ్యతలు చూసుకోవాల్సిందిగా హైకోర్టు నియమించింది. HCA అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ జడ్జి సురేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎథిక్స్ ఆఫీసర్‌గా రిటైర్డ్ జడ్జి భానును కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఇదే కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. HCA ట్రెజరర్ శ్రీనివాస్,సెక్రటరీ రాజేందర్ యాదవ్‌తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ వచ్చింది. ఇటు సీఐడీ విచారణలో మాజీ అధ్యక్షుడిగా జగన్మోహన్‌రావు చేసిన లీలలన్నీ బయటపడుతున్నాయి. 500 మ్యాచ్‌ల రికార్డులను పరిశీలించిన సీఐడీ అధికారులు.. మ్యాచ్ సమయంలో HCA చెల్లించిన బిల్లులపై ఆరా తీశారు. జగన్మోహన్‌రావు తన సొంత సంస్థలకు క్యాటరింగ్ ఇచ్చినట్టు గుర్తించారు. ఒక్కోప్లేట్‌కు 2 వేల రూపాయలు బిల్ వేయడం చూసి అధికారులే షాక్ అయ్యారు. ఇది చిన్న ఎగ్జాపుల్ మాత్రమే ఇలాంటి షాకింగ్ విషయాలు మరెన్నో ఉన్నాయంటున్నారు అధికారులు.
మొత్తంగా HCAలో ఇన్నాళ్లూ పందికొక్కుల్లా మెక్కిన దండుపాళ్యం బ్యాచ్‌కు సీఐడీ చుక్కలు చూపిస్తుంటే… కేసు CBIకి అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక CBIకి గానీ ఈ కేసు వెళ్తే ఈ దొంగల ముఠాకి మూడినట్లే…! మరోవైపు HCA కేసు CBIకి అప్పగించాలంటూ సఫిల్‌గూడా క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది…! మరి చూడాలి సోమవారం ఎలాంటి తీర్పురానుందో…!