Kingdom Trailer: దుమ్మురేపిన విజయ్ దేవరకొండ..! కింగ్‌డమ్ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది మావ..!

Kingdom Trailer: దుమ్మురేపిన విజయ్ దేవరకొండ..! కింగ్‌డమ్ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది మావ..!


విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ జీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు గౌతమ్. విజయ్ ఇంతవరకు ట్రై చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. లవ్, ఫ్యామిలీ స్టోరీస్ తో ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

విజయ్ తో పాటు సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. అలాగే యాక్షన్స్ సీన్స్ లో విజయ్ ఇరగదీశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా విజయ్ లుక్స్ హైలైట్ అనే చెప్పాలి. గుండుతో విజయ్ చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. అలాగే ట్రైలర్ లోని డైలాగ్స్ కూడా హైప్ క్రియేట్ చేశాయి. ఇక యాక్షన్ సీన్స్ లోనూ విజయ్ అదరగొట్టాడు. ఇక సినిమాలో అన్న తమ్ముళ్ల మధ్యా బాండింగ్ ను హైలైట్ చేసి చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఆల్రెడీ హైప్ పెంచగా… సినిమాటోగ్రఫీ విభాగంలో జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కలిసి విజువల్స్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం జూలై 31న వరల్డ్‌వైడ్ ప్యాన్‌ఇండియా మూవీగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *