ఒక వైపు భార్యలో చేతిలో భర్తలు హత్యకు గురవుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతుంటే.. మరోవైపు భార్యలపై భర్తల వేధింపులు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజా భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నివసిస్తున్న ఒక పోలీసు అధికారి భార్య తన భర్త వేధింపులతో బాధపడుతూ ఒక వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ వీడియోలో తన భర్త తనను వేధిస్తున్నాడని, అలాగే తన భర్త బావ కూడా తన చావుకు కారణం అంటూ ఆరోపించింది. ఆ మహిళ తన బాధను వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన భర్త వేధింపుల కారణంగా సౌమ్య కశ్యప్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. ఆమెను కొట్టారని, మానసికంగా వేధించారని, భర్త అనురాగ్ సింగ్, తన బావ, బావ సోదరుడు తనను వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివసించాడు. కానిస్టేబుల్ అనురాగ్‌ను బికెటి పోలీస్ స్టేషన్‌లోని ఈగిల్ మొబైల్‌లో పోస్ట్ చేశారు.
నా భర్తకు మళ్ళీ వివాహం చేయాలనుకుంటున్నారు. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈ రోజు నేను చనిపోతున్నానంటే కారణం ఈ వ్యక్తులే. కేసు గురించిన సమాచారాన్ని మృతురాలి కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి