కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలో ఏటా శ్రావణమాసం తొలి శనివారానికి ముందు వచ్చే శుక్రవారం అర్ధరాత్రి ఓ ఉత్సవం జరుగుతుంది. ఇందులో.. వెంకటాపురం కాలనీ నుండి సుమారు 1000 మంది కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధానికి బయలు దేరినట్లుగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకుంటూ బయలుదేరతారు. ఇలా.. వారు తమ గ్రామం నుంచి 40 కి.మీ కాలినడకన ప్రయాణించి.. గంగవరం చేరుకుని, అక్కడి తుంగభద్ర నదిలో దిగి.. నమస్కరించి.. ఆ నదీ జలాలను సేకరిస్తారు. అనంతరం అందరూ కలిసి.. తిరిగి తమ గ్రామం చేరుకుని, అక్కడ వేంచేసిన గుంటి రంగా స్వామికి జలాభిషేకం చేస్తారు. అనంతరం పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి గోవింద నామస్మరణలు చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమయంలో స్వయంగా స్వామివారు కూడా తమతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని అక్కడి భక్తుల విశ్వాసం. ఆ సమయంలో శారీరక, మానసిక, బాధలతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ బోర్లా పడుకుంటారు. నది జలాలు తీసుకొచ్చిన భక్తులు.. ఆలయం చుట్టూ పడుకొని ఉన్న వారిపైనుంచి దాటుకుంటూ వెళ్తారు. వారి పాదధూళి సోకటం వల్ల తమకున్న సకల రోగాలు, సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఏటా ఇలా.. ఆయుధాలు పట్టుకొని పరుగులు తీసే వేడుక జరిపితే.. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్ వీడియో
డెలివరీ బోయ్స్‌గా షాపులోకి ఎంట్రీ.. కట్‌చేస్తే
అదృష్టమంటే ఇదే.. ఒకేసారి 8 వజ్రాలు దొరికాయ్ వీడియో
అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో