Video: పెద్ద పాము.. రెండు కప్పలను మింగింది! ఆ తర్వాత దాని పరిస్థితి చూడండి ఏమైందో..

Video: పెద్ద పాము.. రెండు కప్పలను మింగింది! ఆ తర్వాత దాని పరిస్థితి చూడండి ఏమైందో..


వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇంటి పరిసరాల్లోకి వస్తూ.. మనల్ని భయాందోళనలకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. బాగా ఆకలి మీదున్న ఓ పాము ఏకంగా రెండు కప్పలను మింగేసింది. ఆ తర్వాత దాని పరిస్థితి చూడాలి.. పాపం.. విలవిలలాడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఒక నాగుపాము రెండు పెద్ద కప్పలను మింగింది. కానీ మింగిన కొద్ది సేపటికే అది అతలా కుతలం అయిపోయింది. పెద్ద కప్పలను మిగడం అయితే మింగింది కానీ.. వాటిని అరగదీసుకోవడం దాని వల్ల కాలేదు. వెంటనే ఆ రెండు కప్పలను బయటికి కక్కింది. అలా కక్కే ప్రయత్నంలో అల్లాడిపోయింది. ఈ వీడియోను cobra_lover_suraj అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. కింద ఉన్న వీడియోను మీరు కూడా చూసేయండి..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *