Fact Check: ప్రభుత్వం అందరి వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డు చేస్తుందా? ఇది నిజమేనా?

Fact Check: ప్రభుత్వం అందరి వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డు చేస్తుందా? ఇది నిజమేనా?


భారత ప్రభుత్వం అన్ని వాట్సాప్ వాయిస్, వీడియో కాల్‌లను రికార్డ్ చేసి సేవ్ చేసే కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందని వాట్సాప్‌లో ఈ వార్త వైరల్‌ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వ సంస్థలు పర్యవేక్షిస్తాయని కూడా ఆరోపించింది. అయితే, ఈ వాదన పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

ఇవి కూడా చదవండి

భారతదేశంలో లక్షలాది మంది వినియోగదారులు వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రైవసీ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ సందేశం భయాందోళనలకు గురిచేసింది. వినియోగదారులు ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన విషయాలను పంచుకోకుండా ఉండాలని సూచించారు. ఎందుకంటే ఫోన్‌ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుందని, ఉల్లంఘించినవారు వారెంట్ లేకుండా అరెస్టును ఎదుర్కోవలసి ఉంటుందని వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

ఈ వైరల్‌ అవుతున్న సందేశంపై భారత ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ Xలో ఒక వివరణను ఇస్తూ పోస్ట్ చేసింది. “WhatsApp కోసం కొత్త ప్రభుత్వ మార్గదర్శకాలను క్లెయిమ్ చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వార్తలు పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది. ఇలాంటివి నమ్మవద్దని పేర్కొంది. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ సమాచారం తప్పు అని వెల్లడించింది. ప్రభుత్వం అటువంటి నియమాలు లేదా మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *