Tollywood: 13 ఏళ్ల క్రితం శివాజీ పక్కన చేసిన హీరోయిన్.. ఇప్పుడు టాప్ లెవల్‌కు

Tollywood: 13 ఏళ్ల క్రితం శివాజీ పక్కన చేసిన హీరోయిన్.. ఇప్పుడు టాప్ లెవల్‌కు


బిగ్ బాస్ సీజన్ 7తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నటుడు శివాజీ. ఎంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా, బిగ్ బాస్ హౌస్‌లో తన మాటతో, వైఖరితో అందరినీ ఆకట్టుకున్నాడు. హౌస్‌లో ప్రశాంత్, యావర్‌లకు అండగా నిలిచి.. వాళ్లను ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన శివాజీ.. ప్రశాంత్ విజేతగా నిలవగానే తన ప్రయాణం పూర్తైందన్న భావనతో బయటకు వచ్చాడు. ఈ షో ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. ఆయన బయటకు వచ్చాక రిలీజైన 90’స్ వెబ్ సిరీస్, ఆ తర్వాత చేసిన కోర్టు సినిమా బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. అతని సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్ అంతే.

ఒకప్పుడు నేచురల్ స్టార్‌గా పాపులర్ అయిన శివాజీ, రొమాంటిక్ హీరోగా ఎంతో మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. ముఖ్యంగా తాజ్ మహల్ అనే ప్రేమకథా చిత్రంలో ఆయన పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాలో ఆయనకు జోడీగా కనిపించిన హీరోయిన్ గుర్తుందా?. ఆమే ఇప్పుడు బాలీవుడ్‌లో యమా క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ! కానీ అప్పట్లో ఆమె పేరు శ్రుతి అని టైటిల్ కార్డ్స్‌లో వేశారు.. కానీ అసలైన పేరు నుష్రత్ భరూచా!

నుష్రత్ భరూచా.. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌లోనూ హీరోయిన్‌గా మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. తెలుగులో 13 ఏళ్ల క్రితం చేసిన ఒక్క సినిమా తర్వాత మళ్లీ ఇక్కడ కనిపించకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం సత్తా చాటుతోంది. తన లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *