రూ.10 వేల తగ్గింపు.. అతి తక్కువ ధరకే క్రేజీ స్మార్ట్‌ ఫోన్‌! కొనాలంటే ఇదే రైట్‌ టైమ్‌

రూ.10 వేల తగ్గింపు.. అతి తక్కువ ధరకే క్రేజీ స్మార్ట్‌ ఫోన్‌! కొనాలంటే ఇదే రైట్‌ టైమ్‌


200 MP మెయిన్ కెమెరా, IP54 రేటింగ్ వంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో గత సంవత్సరం లాంచ్ అయిన Xiaomiకి చెందిన Redmi Note 13 Pro భారతదేశంలో భారీ ధర తగ్గుదలను చూసింది. మొదట్లో రూ.28,999 ధరకు ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు ప్లాట్‌ఫామ్‌లో రూ.19,699 ధరకే అందుబాటులో ఉంది. రూ.20,000 లోపు ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తక్షణ 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. వీటికి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

8GB RAM, 128GB స్టోరేజ్‌, 8GB RAM, 256GB స్టోరేజ్‌, 12GB RAM, 256GB స్టోరేజ్‌లతో ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్‌ సేల్‌లో అందుబాటులో ఉంది.ఈ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేతో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ​్‌తో వస్తుంది.

200MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. స్పష్టమైన వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ప్రస్తుత తగ్గింపు ధరకు Redmi Note 13 Pro అద్భుతమైన విలువను అందిస్తుంది-ముఖ్యంగా బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ లాంటి కెమెరా నాణ్యత, బలమైన పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *