Independence Day 2025: ఎర్ర కోట ఎందుకు ప్రత్యేకం? ఇక్కడే ప్రతి ఏడాది ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరవేస్తారో తెలుసా

Independence Day 2025: ఎర్ర కోట ఎందుకు ప్రత్యేకం? ఇక్కడే ప్రతి ఏడాది ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరవేస్తారో తెలుసా


ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారం దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇలా జాతీయ జెండా రెపరెపలు చూడడంతోనే కోట్లాది మంది భారతీయుల గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ జెండా ఎగరవేయడం కేవలం లాంఛనప్రాయంగా చేసే ఒక కార్యక్రమం కాదు. లక్షలాది మంది ప్రజల త్యాగాలతో సాధించిన స్వాతంత్ర్య పోరాటానికి జ్ఞాపకం. అయితే ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎల్లప్పుడూ ఎర్రకోటపై ఎందుకు ఎగురవేస్తారు.. మరే ఏ భవనంపైనా ఎందుకు ఎగురవేయరని ఆలోచిస్తున్నారా.. ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోండి. చరిత్ర, గర్వం,జాతీయ గుర్తింపుతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం ప్రతి భారతీయుడికి ప్రత్యేకమైనది.

నివేదికల ప్రకారం ఎర్రకోట చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎర్రకోటను ఆంగ్లంలో రెడ్ పోర్ట్ అని పిలుస్తారు. ఇది ఢిల్లీలోని చారిత్రాత్మక కోట. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638 లో నిర్మించాడు. దీనిని నిర్మించడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పట్టిందని నమ్ముతారు. ఈ కోట వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు.. ఇది భారతదేశ శక్తి, పాలనకు చిహ్నంగా నిలిచింది.

ఎర్రకోట వద్ద 1947 ఆగస్టు 15న ఏం జరిగిందంటే
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతదేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోట బురుజుల నుంచి మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశం శతాబ్దాల బానిసత్వాన్ని వీడి స్వాతంత్ర్యాన్ని జరుపుకున్న చారిత్రాత్మక క్షణం అది.

ఇవి కూడా చదవండి

ప్రధాని ఎర్రకోటపై మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎందుకు ఎగురవేస్తారంటే

  1. ఎర్రకోట స్వతంత్ర భారతదేశానికి చిహ్నంగా మారింది.
  2. ఈ కోట నుండే మన దేశం స్వాతంత్ర్య పొందిందని మొదటి సారిగా ప్రకటన చేశారు.
  3. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఇక్కడ నుండే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
  4. ఎర్రకోట ఢిల్లీ మధ్యలో ఉంది. భద్రతా దృక్కోణంలో కూడా మంచిది ప్రదేశంగా పరిగణించబడుతుంది.
  5. ఈ ప్రదేశం భాతీయుల భావోద్వేగపరంగా ముడిపడి ఉంది.

ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు

భారత ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి జెండాను ఎగురవేస్తారు. తర్వాత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సంప్రదాయం 1947 నుంచి నేటికీ కొనసాగుతోంది. ఇది జాతీయవాదంలో భాగంగా మారింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *