దారుణం.. కుక్క నాకిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం.. 78 మంది విద్యార్థులకు రేబిస్ టీకా!

దారుణం.. కుక్క నాకిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం.. 78 మంది విద్యార్థులకు రేబిస్ టీకా!


వీధి కుక్కలు కలుషితం చేసిన కూరగాయలతో వండిన మధ్యాహ్న భోజనం తిన్న 78 మంది విద్యార్థులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్​గఢ్​లో చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్ జిల్లా లఛన్​పుర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జులై 29న ఓ వీధి కుక్క వచ్చి వంటగది దగ్గర ఉన్న కూరగాయలను నాకింది. ఈ విషయాన్ని విద్యార్థులు చెప్పినా కూడా ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు. విషయం గ్రామస్తులకు తెలియడంతో విషయం మరింత తీవ్రమైంది.

కోపంతో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వెంటనే పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యంపై కమిటీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారం కలుషితమైందని పిల్లలు ఇప్పటికే చెప్పినప్పటికీ, దానిని ఎందుకు వడ్డించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులు ఆగ్రహంతో స్పందించిన టీచర్లు పిల్లలకు టీకా వేశారు. వంట నిర్వాహకులను తొలగించారు.

పరిస్థితి తీవ్రతను గమనించి, ఆరోగ్య శాఖ బృందాన్ని అక్కడికక్కడే పిలిపించారు. పిల్లలలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. కానీ, ముందుజాగ్రత్తగా 78 మంది పిల్లలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి ఇవ్వబడింది. దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన మరోసారి పాఠశాలల్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం సురక్షితమేనా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆహార భద్రతకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తున్నారా అనే విషయాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *