Asia Cup 2025 : రోహిత్, కోహ్లీ లేకుండా ఆసియా కప్‌కు టీమిండియా రెడీ.. ఓపెనింగ్ కోసం భారీ పోటీ

Asia Cup 2025 : రోహిత్, కోహ్లీ లేకుండా ఆసియా కప్‌కు టీమిండియా రెడీ.. ఓపెనింగ్ కోసం భారీ పోటీ


Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాల్గొనడం లేదని స్పష్టమైంది. దీంతో భారత జట్టు ఓపెనింగ్ కాంబినేషన్‌లో భారీ మార్పులు జరగనున్నాయి. బీసీసీఐ ఈ నెల చివరి నాటికి జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఓపెనింగ్ ప్లేస్ కోసం నలుగురు ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతుండటంతో సెలక్టర్లకు కష్టం ఎదురైంది.

ఆసియా కప్ 2025 టి20 ఫార్మాట్‌లో జరుగుతుండడంతో టీమిండియా ఓపెనర్ల ఎంపిక సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో, నాలుగు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కుతుంది.

ఓపెనర్ల రేసులో ఉన్న ఆటగాళ్లు

సంజూ శాంసన్: టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణించే ఆటగాడు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా మూడు సెంచరీలు చేశాడు. అతని దూకుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అతన్ని బలమైన అభ్యర్థిగా నిలబెట్టాయి.

అభిషేక్ శర్మ: ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇతను దూకుడైన ఆటతీరుకు ప్రసిద్ధి. ఇతను కూడా రెండు టీ20 సెంచరీలు చేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈ పిచ్‌లపై అతని అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది.

యశస్వి జైస్వాల్: ఈ యువ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతని దూకుడైన ఆట శైలి, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అతను కూడా ఆసియా కప్‌కు సరైన ఎంపిక.

ఆసియా కప్ 2025 ఫార్మాట్

వేదిక: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

తేదీలు: సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు

జట్లు: మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వాటిని నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.

సూపర్ ఫోర్: ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి.

ఫైనల్: సూపర్ ఫోర్ దశలో టాప్ 2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *