Meaning of Meditation: Master These All-Time Best 9 Secret Techniques ధ్యానం

Meaning of Meditation: Master These All-Time Best 9 Secret Techniques ధ్యానం

Meaning Of Meditation is simple view is ధ్యానం అనేది మానసిక స్పష్టత, భావోద్వేగ ప్రశాంతత మరియు అంతర్గత శాంతిని సాధించడానికి ఒక నిర్దిష్ట వస్తువు, ఆలోచన లేదా కార్యాచరణపై మనస్సును కేంద్రీకరించే మానసిక అభ్యాసం. ఒత్తిడిని తగ్గించడానికి, దృష్టిని మెరుగుపరచడానికి మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడటానికి ఇది తరచుగా బుద్ధిపూర్వకత, ఏకాగ్రత మరియు విశ్రాంతి వంటి పద్ధతులను కలిగి ఉంటుంది.

అనంతమైన ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గమే ధ్యానం. ప్రార్థనలు, కర్మకలాపాలు ఇతర విధాలైన పూజలు ఇవన్నీ ధ్యానంలో ఒకటవ తరగతి లాంటివి మాత్రమే! ప్రార్ధన చేస్తూ ఏదో ఒకటి నివేదన చేస్తావు. దానివల్ల మనలోని ఆధ్యాత్మికత జాగృతమౌతుంది. Meaning Of Meditation ప్రకారం అన్నీ మనలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసేవే. కొన్నికొన్ని ‘శబ్దాలను’ ఉచ్చరించడంతో మొదలుకుని, పుష్పాలు, ప్రతిమలు, దేవాలయాలు, హారతి ఇవ్వటానికి ఉపయోగించే దీపారాధనలు, ఇత్యాదులన్నీ ఆధ్యాత్మిక దృక్పథానికి మనస్సును చేరుస్తాయి. అయితే ఆ దృక్పథం మరెక్కడో లేదు. అది మానవుని ఆత్మలోనే ఉంది. మనుష్యులంతా ఇది చేస్తూనే ఉన్నారు. కానీ వారు తమకు తెలియకుండా ఏది చేస్తున్నారో, దానినే ధ్యానంలో తెలిసి చేస్తారు. అదే ధ్యానం యొక్క శక్తి.

Meaning of meditation ధ్యానం is not meditation if the mind is not devoid of all thoughts.only through such mediation,peaceful and liberation are obtained. there is no doubt( మనస్సు అన్ని ఆలోచనలు లేకుండా ఉండకపోతే ధ్యానం ధ్యానం కాదు. అటువంటి మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే శాంతి మరియు విముక్తి లభిస్తుంది. ఎటువంటి సందేహం లేదు)నెమ్మదినెమ్మదిగా, క్రమక్రమంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఇదేదో చమత్కారం కాదు. ఒక రోజుతో అయ్యే పని కాదు. కొన్ని సంవత్సరాలు – కొన్ని జన్మలు, పట్టవచ్చు. అయినా ఇటూ వేగంగా ఫర్వాలేదు! దాన్ని కొనసాగించవలసిందే. to know about more meaning of meditation.

మనమేమి చేస్తున్నామన్న దాని మీద పూర్తి అవగాహనతో, పూర్తి స్పృహతో, స్వచ్ఛందంగా ఈ ధ్యానసాధనను కొనసాగించాలి. కొద్దికొద్దిగా దాని లోతుపాతుల్ని గ్రహించగలుగుతాం ప్రత్యక్షంగా అనుభూతి చెందడం ప్రారంభించి నిజమైన పారమార్థిక నిధులను పొందగలుగుతాం వాటిని మనకు ఎవరు దూరం చేయలేరు ఆ సంపదను ఎవరూ నాశనం చేయలేరు అంతేకాదు ఆ ఆనందాన్ని ఏ విషాదము వెనక్కి కప్పి వేయలేదు.

సత్యాన్వేషణలో - In search of truth Meaning Of Meditation 

Meaning Of Meditation is ఈ అనుభూతులను (భగవంతుని గురించిన ప్రత్యక్షానుభూతి) ఏ విధంగా పొందాలో తెలియజేసే శాస్త్రమే యోగం. “మతం” అనే దానిని అనుభూతి చెందే వరకూ దానిని గురించి కేవలం మాట్లాడి ప్రయోజనం లేదు. భగవంతుని పేరిట ఇన్ని యుద్ధాలు, కలహాలు జరిగి, ఇంత అలజడి చెలరేగేది ఎందుకు? భగవంతుని గురించి జరిగినంత రక్తపాతం మరి ఏ కారణం వల్లా జరగలేదు. ఎందువలనంటే ప్రజలు ఎన్నడూ అసలైన మూలస్థానానికి వెళ్ళరు. ప్రతివారూ తమ పూర్వీకులు తమకు అలవరచిన కొన్ని ఆచారాలను మాత్రం మనస్సులో పెట్టుకుని, వాటితోనే సంతృప్తి చెంది, ఇతరులను కూడా అవే ఆచరించమని బలవంతం చేస్తారు.
తాను అనుభూతి చెందని ఆత్మ గురించీ, తాను దర్శించని భగవంతుణ్ణి గురించీ, చెప్పేందుకు ఎవరికి హక్కున్నది? భగవంతుడే ఉన్నట్లయితే, ఆయనను మనం చూడాలి. ఆత్మ అనేది ఒకటి ఉన్నట్లయితే దానిని మనం గ్రహించి, అనుభూతి చెందగలగాలి. విధంగా చేయలేనట్లయితే, వాటిని అసలు నమ్మకపోవటమే మంచిది. కపటులుగా ఉండేకన్నా బాహాటంగా, నిష్కపటంగా మాట్లాడే నాస్తికునిగా ఉండటమే మేలు. మానవుడు సత్యాన్నే వాంఛిస్తాడు. తనంతట తాను సత్యానుభూతిని పొందాలనుకుంటాడు(Meaning Of Meditation). ఆ అనుభూతిని పొందినప్పుడే, తన హృదయాంతరాళంలో ఆ సత్యదర్శనం కలిగినప్పుడే, అన్ని సందేహాలూ సమసిపోయి, అంధకారం రూపుమాసి, కపట స్వభావం సరళ స్వభావం అవుతుందని వేదాలు తెలియజేస్తున్నాయి.

మనస్సెంత చంచలమైనది!(Mind blowing!)

in Meaning Of Meditation first మనస్సును నియంత్రించటం. మనస్సును నియంత్రించటం ఎంత కష్టం! దానిని ఒక పిచ్చిపట్టిన(monkey)కోతితోపోలుస్తారు. ఇతర కోతులలాగా స్వాభావికంగా చపలబుద్ధిగల ఒక కోతి ఉంది. అది సరిపోదా అన్నట్లు ఒకరు ఆ కోతిచేత సారాయి త్రాగించి, దాని బుద్ధి మరింత చపలమయ్యేట్లు చేశారు. ఆ తర్వాత ఆ కోతిని ఒక తేలు కుట్టింది. ఒక మనిషిని గనక తేలు కుడితే ఒక రోజంతా బాధతో గంతులేస్తాడు కదా! పాపం! ఆ కోతి బాధ వర్ణనాతీతం. ఈ కష్టాలు చాలవా అన్నట్లు, ఆ కోతిని ఒక దయ్యం ఆవహించింది. వీటన్నిటితో బాధపడే ఆ కోతి యొక్క అదుపులేని చిత్తచాపల్యాన్ని ఏ భాష వర్ణించగలదు? మానవుని మనస్సు ఆ కోతిలాంటిది.స్వాభావికంగా అంతులేని కార్యకలాపాల్లో మునిగి ఉండే మనస్సు, కోరికలనే సారాయి త్రాగటం వల్ల మరింత సంక్షోభంలో పడిపోతుంది. కోరిక తర్వాత ఇతరుల అభివృద్ధి చూసి ఓర్వలేని ఈర్ష్య అనే తేలు కుడుతుంది. చివరిగా గర్వం అనే దయ్యం మనస్సును । ఆవహించి తానే అందరిలోకీ గొప్పదానిననే భావం కలుగచేస్తుంది. ఇటువంటి మనస్సును నియంత్రించడం ఎంత కష్టం!
Meaning of Meditation

అత్యంత కష్టమైన పని(The most difficult task) in Meaning Of Meditation

యోగులు చెప్పేదానిననుసరించి (in Meaning Of Meditation ) మూడు ముఖ్యమైన నాడీ ప్రవాహాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ మూడూ వెన్నెముక లోపల ఉన్నాయి. ఒకదానిని “ఇడ” అని మరొక దానిని "పింగళ” అని ఆ రెంటి మధ్య ఉన్న దానిని “సుషుమ్న” అని అంటారు.ఎడమకుడివైపుల ఉండే ఇడ, పింగళ నాడులు, నాడీ సముహాలతో ఏర్పడ్డాయి. మధ్యలో ఉండే సుషుమ్న మాత్రం బోలుగా ఉంటుంది. దానిలో నాడీ సమూహాలు ఏమీ ఉండవు. ఈ సుషుమ్న నాడి మూసివేయబడి ఉంటుంది. సాధారణ మానవుడిలో ఇడ, పింగళ నాడులు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి.కాబట్టి సుషుమ్ననాడి అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు.ఈ నాడులగుండా ప్రవాహాలు పైకి క్రిందికి వస్తూపోతూ శరీరంలోని వివిధ భాగాలలో ఉన్న నాడుల ద్వారా శరీరమంతటికీ ఆదేశాలు తీసుకొని వెళుతూ ఉంటాయి.

మన ఎదుట ఉన్న కార్యం అపారమైనది. మన మనస్సులో అణగారిన ఆలోచనా సమూహాల మొత్తం అపారం. అవి మన స్వభావంగా మారిపోయాయి. వాటిని వశపరుచుకోవటమే మన అత్యంత ప్రధానమైన కర్తవ్యం. మనం చెడును చేస్తాము. ఇదే మనకు కన్పిస్తుంది. కానీ దీనికి కారణం మనకు కనిపించని, మనం తెలుసుకోలేనంత లోతుగా ఉండే అచేతనపు (Unconscious) పరిధిలో ఉంటుంది. కాబట్టి అది మరింత శక్తిమంతంగా ఉంటుంది.

అట్టడుగున, అచేతన స్థాయిలో (Unconscious) మనకు తెలియకుండా ఉన్న మొట్టమొదటి కర్తవ్యం. దానిని స్వాధీనపరచుకోవటమనేది మన తర్వాత మనకు కనిపించే జాగృత స్థితికి మన ఎదుట ఉన్న కార్యం అపారమైనది. మన మనస్సులో అణగారిన ఆలోచనా సమూహాల మొత్తం అపారం. అవి మన స్వభావంగా మారిపోయాయి. వాటిని వశపరుచుకోవటమే మన అత్యంత ప్రధానమైన కర్తవ్యం.

మనం చెడును చేస్తాము. ఇదే మనకు కన్పిస్తుంది. కానీ దీనికి కారణం మనకు కనిపించని, మనం తెలుసుకోలేనంత లోతుగా ఉండే అచేతనపు (Unconscious) పరిధిలో ఉంటుంది. కాబట్టి అది మరింత శక్తిమంతంగా ఉంటుంది.అట్టడుగున, అచేతన స్థాయిలో (Unconscious) మనకు తెలియకుండా ఉన్న మొట్టమొదటి కర్తవ్యం. దానిని స్వాధీనపరచుకోవటమనేది మన తర్వాత మనకు కనిపించే జాగృత స్థితికి (చేతనాస్థితికి) కూడా అతీతంగా వెళ్ళాలి. కాబట్టి మనం చేయవలసిన పనులు రెండు రకాలు. మనలో సాధారణంగా ప్రవహిస్తూ ఉన్న రెండు ప్రవాహాలైన ఇడ, పింగళ నాడుల్ని చక్కగా, సమస్థితిలో పనిచేసేలా చూసుకొని మన అంతర్గత కార్యకలాపాల్ని మన అధీనంలో ఉంచుకోవడం మొదటి పని.ఆ తరువాత వాటిని దాటి, అంత కన్నా ఉన్నతమైన స్థాయిలలో ఉన్న చేతనాస్థితిని దాటటం రెండవ పని.

సుదీర్ఘమైన కాలం ఆత్మను గురించిన తదేకనిష్ఠతో చింతన, సాధన చేసి ఈ సత్యాన్ని పొందగలిగిన వాడే నిజమైన యోగి. అప్పుడు సుషుమ్నానాడి ద్వారం తెరవబడి, అంతకు ముందు ఎన్నడూ ఈ క్రొత్త మార్గం గుండా ప్రవహించని ఒక కొత్త ప్రవాహం దాని ద్వారా ప్రవహించి, క్రమంగా విభిన్న యోగకేంద్రాలకు చేరి చివరికి శిరస్సును చేరుకుంటుంది. అప్పుడే యోగి తానే పరమాత్మననే సత్యాన్ని గ్రహించగలుగుతాడు (Meaning Of Meditation). you know more about Meaning Of Meditation?

ధ్యానానికి అనువైన పరిస్థితులు

మీలో తగిన స్తోమత ఉన్నవారు ఈ సాధన కోసం ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆ గదిలో నిద్రించ కూడదు. దాన్ని అతి పవిత్రంగా ఉంచాలి. ఆ గదిలోకి స్నానం చేసి పరిశుభ్రమైన శరీరం, మనస్సులతో ప్రవేశించాలి. ఆ గదిలో పూలతో అలంకరణ చేయండి. పూలు యోగులకు అనుకూలించే ఒక చక్కని వాతావరణాన్ని కలుగచేస్తాయి. ఆహ్లాదకరమైన చిత్రపటాల్ని కూడా ఆ గదిలో ఉంచాలి.

ఉదయం, సాయంత్రం అగరవత్తులు వెలిగించాలి. ఆ గదిలో ఉన్నపుడు కలహం, కోపం, అపవిత్రమైన ఆలోచనలు కలుగకూడదు.పవిత్ర మీలో తగిన స్తోమత ఉన్నవారు ఈ సాధన కోసం ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆ గదిలో నిద్రించ కూడదు. దాన్ని అతి పవిత్రంగా ఉంచాలి. ఆ గదిలోకి స్నానం చేసి పరిశుభ్రమైన శరీరం, మనస్సులతో ప్రవేశించాలి. ఆ గదిలో పూలతో అలంకరణ చేయండి. పూలు యోగులకు అనుకూలించే ఒక చక్కని వాతావరణాన్ని కలుగచేస్తాయి.

ఆహ్లాదకరమైన చిత్రపటాల్ని కూడా ఆ గదిలో ఉంచాలి. ఉదయం, సాయంత్రం అగరవత్తులు వెలిగించాలి. ఆ గదిలో ఉన్నపుడు కలహం, కోపం, అపవిత్రమైన ఆలోచనలు కలుగకూడదు.పవిత్ర భావాలు కలవారిని మాత్రమే గదిలోకి అనుమతించాలి.అప్పుడు క్రమక్రమంగా ఆ గదిలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. విచారంగా ఉన్నప్పుడు, సంశయస్థితిలోనూ, విషాదంలోనూ, మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడూ, ఆ గదిలోకి ప్రవేశించగానే ప్రశాంతత లభిస్తుంది.

ఇదే భావంతో దేవాలయాలు, చర్చ్లు నిర్మించబడ్డాయి. ఈనాటికీ కొన్ని దేవాలయాల్లో, చర్చ్లో ఆ విధమైన ప్రశాంతత లభిస్తుంది. కానీ ఈ రోజుల్లో, వాటిలో ఎక్కువశాతంలో, ఆ లక్ష్యమే కనుమరుగైంది. పవిత్రమైన తరంగాలను వ్యాపింపచేయటం ద్వారా ఆ ప్రదేశం పవిత్రమై, పారమార్థిక భావాలను ఉద్దీపింపజేయటమే ఆయా ప్రదేశాల ప్రయోజనం. ధ్యానానికి విడిగా గది ఏర్పాటు చేసుకోలేనివారు తమ కిష్టమయిన ఏదోవొక ప్రదేశంలో ధ్యానం చేయవచ్చు.

ధ్యానానికి కావలసినవి

అగ్ని ఉన్న చోట, నీరు ఉన్న చోట, ఎండు ఆకులతో కప్పబడి ఉన్న భూమిపైన, చీమలపుట్టలు ఎక్కువగా ఉన్న చోట, క్రూరమృగాలు ఉన్నచోట, ప్రమాదభరితమైన చోట, నాలుగు వీధుల కూడలిలోనూ, శబ్దం ఎక్కువగా ఉన్న చోట, దుర్మార్గులు ఎక్కువగా ఉన్నచోట, యోగసాధన చేయరాదు. ముఖ్యంగా భారతదేశంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ బద్ధకంగానూ, అనారోగ్యంగానూ ఉన్నప్పుడుగానీ, మనస్సు అతి విషాదంలోనూ, విచారకరంగానూ ఉన్నప్పుడుగానీ, ధ్యానించవద్దు. ఇతరులు వచ్చి విఘ్నం కలిగించని ఏకాంత ప్రదేశంలో ధ్యానించాలి. సుందర దృశ్యాలుండే ప్రదేశాలనో, లేక మీ గృహంలోనే చక్కగా ఉండే గదినో ఎన్నుకోండి ధ్యానానికి కూర్చోగానే సనాతన ఋషులందరికీ వందనం చేసి గురువు కి ప్రణామం చేసి ఆ తర్వాత భగవంతునికి నమస్కరించి ధ్యానం ప్రారంభించాలి after you know about meaning of meditation.

ధ్యాన సమయం (Meditation time)

Meaning Of Meditation Is also know as right time,రోజుకు కనీసం రెండుసార్లైనా ధ్యానం చేయాలి. ఉదయం, సాయంత్రం ధ్యానానికి శ్రేష్ఠమైన సమయాలు. రాత్రి పగలుగా, పగలు రాత్రిగా మారే సంధ్యాసమయాలు ప్రశాంతంగా ఉంటాయి. తెల్లవారుజామున, సాయం సమయంలో కూడా సహజంగా ప్రశాంతత ఏర్పడుతుంది.ఆ సమయాలలో శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. స్వాభావికంగా దొరికే ఆ ప్రశాంతతను మనకు అనుగుణంగా మార్చుకొని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేగానీ ఏదీ తినను!' అనే ఒక నియమం పెట్టుకుంటే, ఆకలి బాధ మీ బద్ధకాన్ని వదలగొడుతుంది.  సహజంగా Meaning Of Meditation భారతదేశంలో పిల్లలకి ధ్యానం చేస్తే గానీ ఏదీ తినవద్దని బోధిస్తారు. ఆ అలవాటువల్ల వాళ్ళకు అది సహజస్వభావమై పోతుంది. ఏ బాలుడైనా సరే స్నానం చేసి, ధ్యానం చేసే వరకూ ఆకలి గురించి ఆలోచించడు.

ఇక ప్రార్థన (prayer)

మనస్సులో ఈ విధంగా స్మరించండి:

“సర్వజీవులూ సంతోషంగా ఉండుగాక!

సర్వజీవులూ శాంతితో ఉండుగాక!

సర్వజీవులూ పరమానందంగా ఉండుగాక!”

(in Meaning Of Meditation prayer also one thing)

Remember thus in mind:

“May all beings be happy!

May all beings be at peace!

May all beings be blissful!”)

Meaning Of Meditation మొదటి పాఠము First Lesson

ప్రశాంతంగా కూర్చొని, మనస్సును దానికి తోచినట్టు పరుగెత్తనివ్వండి! దానిని ఊరకే గమనిస్తూ ఉండండి! “జ్ఞానమే శక్తి” అనే సామెత ఉంది కదా! అది పరమసత్యం! మనస్సు ఏమి చేస్తున్నదో తెలిసేదాకా దానిని నీవు వశపరచుకోలేవు. పగ్గాలు మనస్సు చేతిలో పెడితే, అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. ‘ఇటువంటి ఆలోచనలు చెయ్యటం అసలు నాకు సాధ్యమేనా!’ అని నీవే ఆశ్చర్యపడతావు! కానీ క్రమక్రమంగా, రోజురోజుకూ మనస్సు యొక్క చపలత్వపు తీవ్రత తగ్గుతూ వస్తూ, రోజురోజుకూ అది మరింత ప్రశాంతతను పొందటాన్ని నీవే గమనించగలుగుతావు.

అనవసరపు మాటలు,వాగ్వాదాలు వల్ల ప్రయాజనము ఏముంది? అది మనస్సును కల్లోల పరుస్తుంది. మనస్సును మరింత సూక్ష్మమైన విషయాలను గ్రహించగలిగేందుకు ఆయత్తం చెయ్యాలి. అది మాటలతో సాధ్యమౌతుందా? కాబట్టి వృథాసంభాషణలు, మాటలూ మానివెయ్యండి! దివ్యానుభూతిని పొందిన మహనీయుల చేత రచించబడిన గ్రంథాలను మాత్రమే పఠించండి!

ఇపుడు… ఆలోచించు

మీ శరీరాన్ని గురించి శ్రద్ధ తీసుకోండి. శరీరం దృఢంగానూ, ఆరోగ్యంగానూ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అదే మీకున్న శ్రేష్ఠమైన పరికరమని తెలుసుకోండి! మీ శరీరం వజ్రతుల్యమైనదని ఊహించుకోండి. దాని సహాయంతో సంసార సాగరాన్ని దాటగలమని ఊహించుకోండి! బలహీనులకు ఎన్నడూ ముక్తి లభించదు. బలహీనతను పారద్రోలండి! ‘మీ శరీరం, మనస్సు దృఢంగా, బలంగా ఉన్నాయి!’ అని భావించండి. ఆశావహదృక్పథంతో మీపై మీరు విశ్వాసాన్ని కలిగి వుండండి!

‘ధ్యానం – కొన్ని పద్ధతులు

శిరస్సు పైన, కొన్ని అంగుళాల ఎత్తులో ఒక కమలం (తామరపువ్వు) ఉన్నట్లు ఊహించుకోండి. సచ్ఛీలం దాని కేంద్రభాగంగానూ, జ్ఞానం దాని కాడగానూ భావించండి. ఆ కమలంలోని బయటవున్న ఎనిమిది దళాలూ యోగి యొక్క అష్టసిద్ధులు. ఆ పుష్పం లోపలి భాగంలో ఉన్న అండాశయం, పుప్పొడి తిత్తులూ – వైరాగ్యం. యోగి బయటవున్న అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తే ముక్తిని పొందగలుగుతాడు.

కాబట్టి బయటకు కనిపించే ఆ అష్ట దళాలు అష్టసిధుల్ని సూచించిన ఆ లోపలున్న పుప్పొడి తిత్తులూ,అండాశయమూ తీవ్రవైరాగ్యమే సూచిస్తాయి. ఆ అష్టసిద్ధుల్నీ త్యాగం చేయగల తీవ్రవైరాగ్యమే మనకు కావలసినది. ఆ తామరపుష్పం లోపల హిరణ్యగర్భస్వరూపుడై, మేధస్సుకు అగ్రాహ్యుడై, “ఓం” అన్న ప్రణవనాదాన్నే నామంగా కలిగి వున్న అవ్యక్తుడైన “పరమాత్మ”, తన చుట్టూ అద్భుతమైన కాంతులతో పరివేష్టితుడై ఉన్నట్లు భావించి, ఆయనను ధ్యానించండి. ‘ధ్యానం – కొన్ని పద్ధతులు ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.

మరొక సూచన :- మీ హృదయం లోపల ఒక ఖాళీ స్థలం ఉన్నట్లూ, దాని మధ్యలో ఒక జ్వాల వెలుగుతున్నట్లు భావించండి. జ్వాలయే మీ ఆత్మగానూ, ఆ జ్వాల లోపలగల ప్రకాశవంతమైన కాంతిని మీ ఆత్మకే ఆత్మ అయిన దైవంగానూ భావించండి. మీ హృదయంలో వాటి గురించి ధ్యానించండి.

meaning of meditation yours reach the final goal

Meaning Of Meditation 2 పాఠము (2nd Lesson) లక్ష్యాన్ని చేరటం ఎలా? How to reach the goal?

ఈ శరీరం ఉన్నా, పోయినా పెద్ద తేడా ఏమీ ఉండబోదు. కఠోరమైన సాధన చేయండి. ఫలితం గురించి ఆలోచించకుండా ఇంకాయింకా లోతుకు దిగి తీవ్రమైన కృషి సల్పండి. మీకు తగినంత ధైర్యం ఉంటే ఆరు మాసాలలో పరిపూర్ణమైన యోగులు కాగలుగుతారు. అయితే, ఇది-కొద్దిగా-అది-కొద్దిగా అంటూ, అరకొరగా సాధన చేసి, ఇంకా రకరకాల విషయాలమీదికి మనస్సును పోనిచ్చేవారికి పురోభివృద్ధి లభించదు. ఏవో కొన్ని పాఠాలు నేర్చుకొన్నంత మాత్రాన ప్రయోజనం చేకూరదు.

విజయాన్ని పొందడానికి అకుంఠిత దీక్ష, సంకల్పమూ కావాలి. అటువంటి దీక్ష గలవారు, “నేనీ సముద్రాన్ని త్రాగివేయగలను, నేను తలచుకుంటే ఈ పర్వతాలు కుప్పకూలిపోతాయి!” అని దృఢంగా చెప్పగలరు. అటువంటి శక్తి, మానసిక స్థైర్యం కలిగి తీవ్రకృషి చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలవు.

జాగరూకులై ఉండండి: ఆధునిక సిద్ధాంతం ప్రకారం ద్వేషం, ప్రేమ కూడా ఎక్కడనుంచి బయలుదేరాయో ఆ మూలస్థానానికే తిరిగి చేరాలి. కాబట్టి ఎవరినీ ద్వేషించకండి. ఎందువలనంటే మీ నుంచి బయటకు వెడలిన ద్వేషం దీర్ఘకాలం తర్వాత మిమ్మల్నే చేరుతుంది. మీరు ప్రేమించినట్లయితే ఆ ప్రేమ కూడా చివరికి మిమ్మల్నే చేరుతుంది.

మనస్సు – దాని ఆకృతి

మనిషి యొక్క అంతఃకరణమైన మనస్సులో నాలుగు భాగాలున్నాయి.

మొదటిది మనస్సుమంచిచెడులను అంచనా వేసే ఆలోచనాశక్తి. ఇది అదుపులో ఉండకపోపటం వల్ల ఇంచుమించు పూర్తిగా వృథా చేయబడుతుంది. అయితే సరిగ్గా నడిపించబడినప్పుడు ఇది ఒక అద్భుతమైన శక్తిగా పనిచెయ్యగలదు.
రెండవది బుద్ధి లేదా తెలివి.ఇది మంచిచెడులను నిర్ణయిస్తుంది.
మూడవది అహంకారం.‘నేను-నాది’ అని చెప్పే అహంకారం.
నాలుగవది చిత్తందీనిలోనూ, దీని ద్వారానూ మనస్సుకున్న అన్నిరకాల శక్తులూ పనిచేస్తాయి. మనస్సుకు దీనినే ఆధారం లేక భూమి అనవచ్చు. ఇంకొక రకంగా చెప్పుకుంటే ఇది ఒక సముద్రం అయితే మిగతా శక్తులన్నీ తరంగాలు.
చిత్తం వివిధ వృత్తులుగా తయారవటాన్ని, మార్పుచెందటాన్ని (చిత్తం దాని రూపంలో రకరకాల మార్పులు పొందటాన్ని) నిరోధించే శాస్త్రమే యోగం
సముద్రంలో చంద్రుడు ప్రతిబింబించకుండా చేసే తరంగాలలో నిజ తత్వమైన ఆత్మ మన మన ఫలకం మీద ప్రతిబింబించకుండా చిత్తవృత్తుల అడ్డుకుంటాయి. సముద్రం అద్దంలాగా ప్రశాంతంగా ఉన్నప్పుడే చంద్రుని ప్రతిబింబాన్ని మనం దర్శించవచ్చు. అదేవిధంగా (మనసు అనబడే పదార్థం లేదా )చిత్తం అనేది ఏదైతే ఉందో అది అదుపులోనికి తేబడి పూర్తి ప్రశాంతతను సాధించినప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది.

మన జీవితంలో లక్ష్యాన్ని చేరడానికి ధ్యానం ఎంతో సహాయపడుతుంది. ఇది మనసును కేంద్రీకరించి, శక్తిని సరైన దిశగా ప్రవహింపచేసేందుకు సహకరిస్తుంది. లక్ష్యాన్ని చేరటానికి కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి:

1.స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేయండి: మీరు ఏది సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. లక్ష్యం స్పష్టంగా ఉంటే, దానిని చేరడం సులభం.

2.ప్రతిరోజూ ధ్యానం చేయండి: రోజువారీ ధ్యానం మనసును శాంతంగా ఉంచి, దృష్టిని పెంచుతుంది. ఇది మీను లక్ష్యానికి చేరుకునే మార్గంలో ప్రేరణనిచ్చే సాధన.

3.ధైర్యంగా ఉండండి: లక్ష్య సాధనలో ఏవైనా ఆటంకాలు వస్తే, వాటిని అధిగమించడానికి ధైర్యం అవసరం. ధ్యానం దీర్ఘకాలిక దృష్టిని ఇచ్చి, నిరుత్సాహాన్ని దూరంగా ఉంచుతుంది.

4.క్రమశిక్షణతో ముందుకు సాగండి: మీ లక్ష్యానికి క్రమం తప్పకుండా కృషి చేయడం చాలా ముఖ్యమైనది. ధ్యానం క్రమశిక్షణను పెంపొందిస్తుంది, ఇది ఎప్పటికీ నిలబడే ప్రగతికి అవసరం.

learn all of Meaning Of Meditation helps you ధ్యానం మీ లక్ష్యాన్ని చేరడంలో దృఢత, స్థిరత్వం, మరియు ప్రేరణను అందిస్తుంది.

finally Here are 9 secret techniques for Meaning Of Meditation lasting inner peace through meditation

  1. శ్వాసాధారణ ధ్యానం (Breath Awareness Meditation): మీ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనసును శాంతంగా ఉంచండి. దీని ద్వారా మానసిక స్థిరత్వం మరియు ఏకాగ్రత పెరుగుతుంది.
  2. మంత్ర ధ్యానం (Mantra Meditation): ఒక మంత్రాన్ని పునరావృతం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుంది. ఇది లోపలి శక్తిని పెంచి, ఆత్మ శాంతిని అందిస్తుంది.
  3. ప్రత్యేక దృష్టి ధ్యానం (Focused Attention Meditation): ఏదైనా ఒక దృష్టి బిందువు (వస్తువు, మంత్రం, లేదా శ్వాస)పై కేంద్రీకరించడం. ఇది దృష్టి, ఏకాగ్రత మరియు అవగాహనను మెరుగుపరుస్తుంది.
  4. కృపా ధ్యానం (Loving-kindness Meditation): ప్రేమ మరియు కరుణను మీ చుట్టూ ఉన్న వారికీ పంపించడం ద్వారా హృదయాన్ని తెరిచి, ఆత్మలో శాంతిని పెంపొందించండి.
  5. బోధక ధ్యానం (Guided Meditation): ధ్యానం చేయడానికి ఆడియో లేదా వీడియో ద్వారా మార్గదర్శకత్వం పొందండి. ఇది విశాలమైన ఆలోచనలను పంచి, ఆత్మ స్థితిని ప్రబలంగా చేస్తుంది.
  6. బాడీ స్కాన్ ధ్యానం (Body Scan Meditation): శరీరంలో ప్రతి భాగాన్ని క్రమంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది శారీరక మరియు మానసిక శాంతిని అందిస్తుంది.
  7. జప ధ్యానం (Chanting Meditation): ప్రత్యేకమైన శబ్దాలను జపించడం ద్వారా మనస్సును మరియు శరీరాన్ని శాంతంగా ఉంచుకోండి. జపం చేయడం ఒక శక్తివంతమైన మార్గం.
  8. తాత్విక ధ్యానం (Zen Meditation): కూర్చుని ధ్యానం చేసే పద్ధతిలో శ్వాస, దేహ భంగిమపై దృష్టి కేంద్రీకరించడం. ఇది ఆత్మను లోతుగా పరిశీలించే ఒక మార్గం.
  9. ప్రకృతి ధ్యానం (Nature Meditation): ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా నిస్సిమానందం మరియు ప్రశాంతతను పొందండి. ప్రకృతి శక్తిని పొందడం మనస్సు మరియు హృదయాన్ని తేలికగా చేస్తుంది.

These techniques will help guide you towards Meaning Of Meditation lasting inner peace and mindfulness meditation.