Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు

Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు

శారీరకంగా, మానసికంగా,ప్రసన్నమైన ఆత్మ కల్గిన వాడినే ఆరోగ్యవంతుడు. అంటారు. ఆచార్య సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో ఆరోగ్యం గురించి ఇలా వివరించాడు.”సమదోష సమాగ్నిచ్ఛ సమాధాతు మలక్రియః ప్రసన్నాత్మేంద్రియమనః స్వస్థ ఇత్యభిధీయతే”

దోషాలు, అగ్నులు, ధాతువులు, మలాలు అనేవి సమస్థితిలో ఉండి ఆత్మ ఇంద్రియాలు, మనస్సు ఎలాంటి వికారాలకు లోను కాకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడే ‘ అతన్ని స్వస్థుడు, ఆరోగ్యవంతుడు అంటారు.

మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు దినచర్య. రాత్రిచర్య, మరియు రుతుచర్య అను వానిని, పాటిస్తూ అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను ఆచరిస్తూ దేశ సౌభాగ్యానికి పాటుపడాలని ఆచార్యుల అభిమతం. వీటి గురించి తెలుసుకుందాం.

Good Health Tips For Daily Life

  1. నిద్ర లేచుట: బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించటానికి ముందు గల కాలాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. వాతావరణ కాలుష్యముండదు. పరిశుభ్రమైన గాలి వీస్తుంది. ఏకాగ్రతకు, ధ్యానానికి, చదువుకోవటానికి ఆరోగ్యకరమైన సమయం. సూర్యోదయానికి 2 గంటలముందు సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణించవచ్చు.
  2. జలపానము: తెల్లవారు జామున సుమారు ఒక గ్లాసు (లేదా 250-500 ఎం.ఎల్) నీరు త్రాగాలి.
  3. మల, మూత్ర విసర్జన: మల, మూత్రములను ఉదయాన్నే విసర్జించాలి. మల మూత్రాది వేగాల (natural urges) అవరోధం అనేది వ్యాధులు రావటానికి మూలకారణమని చెప్పారు. మల, మూత్రాదులు వచ్చినప్పుడు వెంటనే విసర్జించాలి. అంతేకాని తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకూడదు. సరిగా మల విసర్జన జరిగితే కడుపుబ్బరం, శరీరం బరువుగా ఉండటం జరుగక అసౌకర్యం లేకుండ ఉంటుంది. మొలల (Piles) వ్యాధితో బాధ పడేరోగులు, గర్భినీ స్త్రీలు నిద్ర సరిగా రాని వాళ్ళు, మత్తు పదార్థాలు సేవించేవారిలో మలబద్ధత కనిపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు పడుకునే ముందు సునాముఖి; స్వాదిష్ఠ విరేచన చూర్ణము లేదా త్రిఫలా చూర్ణం లేదా అభయారిష్ఠం అను మందులు వాడితే విరేచనం సాఫీగా అవుతుంది.
  4. దంతధావనం-నోరు శుభ్రపరుచుకోవటం: ఉదయమునే దంతాలు, నాలుక, నోరు శుభ్రంగా కడుక్కోవాలి. దంతాలు శుభ్రపరుచుకోవటానికి చేదు, వగరు గలవి మరియు యాంటిసెప్టిక్ గుణముగల వేప పుల్లలు, మర్రి, వేగిస, జిల్లేడు, చండ్ర, కానుగ, వావిలి, ఉత్తరేణి, జాజి, మరియు మద్ది చెట్ల కొమ్మల పుల్లలతో బ్రష్ చేసుకోవాలి. పుల్లల చివర్లను బాగా నమిలి బ్రష్లోగ చేసుకుని దంతాలను తోమాలి. పై దంతాలను క్రిందికి, క్రింది దంతాలను పైకి మృదువుగా తోముకోవాలి. చిగుళ్ళకు గాయాలు కాకుండ చూసుకోవాలి. దంతాలు తోమిన తర్వాత చిగుళ్ళను మృదువుగా నోటినిండా నీకు తీసుకుని షకీల పట్టి ఊచేయాలి. నాలుకను చక్కగా శుభ్రం చేసుకోవాలి. వికిట్టల, చాకెట్లు తినటం త్రాగటం చేయకూడదు. దంతాలు, నాలుక శుభ్రపరచిన తర్వాత గోరువెపని నీళ్ళలో కొద్దిగా ఉప్పు చేర్చి పుక్కిట పట్టి ఊచేస్తే మంచిది.
  5. గంఘాపము: (పుక్కిట పట్టి ఉంచుట); అరిమేధాది తైలాన్ని లేదా నువ్వుం నూనెను 10 మి.లీ నోటిలోకి తీసుకొని పుక్కిట పట్ట ఉంచాలి. ఇది 10 నిమిషాలు ఆచరిస్తే దంతాల చిగుళ్ళు గట్టిపడతాయి.
  6. అభ్యంగము: శరీరం మొత్తానిక నూనె రాసుకొని మర్దన చేసుకోవాలి.అభ్యంగానికి నువ్వులనూనె మంచిది. ఆవనూనే (సర్షపతైలం) మరీ మంచిది. అభ్యంగం వలన శరీరం మృధువుగా తయారవుతుంది. చర్మ వ్యాధులు రావు, చర్మానికి ఇన్ఫెక్షన్ కలుగదు. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి, కండరాలు, సంధులు(జాయింట్) తమ తమ విధులు సజావుగా నిర్వహిస్తాయి.
  7. వ్యాయామము: క్రమం తప్పకుండా వ్యాయామము చేస్తే మంచి ఆరోగ్యం కల్గుతుంది. వ్యాయామం వలన శరీరంలోని ప్రతికణం చైతన్యవంతమౌతుంది. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఉచ్చ్వాస, నిచ్ఛ్వాసనలు క్రమబద్ధం చేయబడతాయి. నడక, జాగింగ్, యోగాసనాలు, నాట్యం మొదలగునవి కూడ మంచి వ్యాయామమే. మితిమీరి వ్యాయామం పనికిరాదు. ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవాళ్ళు, రక్తపోటు, గుండెజబ్బులున్నవాళ్లు డాక్టర్లు సూచించిన ఎక్సర్సైజులు మాత్రమే చేయాలి. శరీరానికి చెమట పట్టేవరకు వ్యాయామము చేయాలి.
  8. ధ్యానము: ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు ధ్యానము (Meditation) చేయాలి. శవాసనం 5 నిమిషాలు ఆచరించాలి. ప్రాణాయామం 2-5 నిమిషాలు చేయాలి. వీటి వలన మానసిక ఆందోళన, చిత్తోద్వేగం అధిక రక్తపోటు మొదలగునవి తగ్గు ముఖం పడతాయి. మీకు తెల్సు కదా! మానసిక ఆందోళన, అనేక వ్యాధులకు కారణమవుతుంది అని. దీని వలన నూర్రోట్రాన్స్ మీటర్ల సమస్తితి లోపిస్తుంది. అనేక వ్యాదులు రావటానికి ఆస్కారమేర్పడుతుంది. మెడిటేషన్ వలనమానసిక ప్రశాంతత కల్గుతుంది. తద్వార మంచి ఆరోగ్యం, మనోవికాసం కలుగుతుంది. అధిక రక్తపోటు (High Blood Presure hyprtenstion) గల రోగులు శీర్షాసనం వేయకూడదు. క్షయ (టి.బి) రోగులు వ్యాయామం చేయకూడదు.
  9. స్నానవిధి: ఉదయం-సాయంత్రం విధిగా స్నానం చేయాలి.. స్నానం వల్ల శరీరానికి చేరిన మలినాలు తొలిగిపోతాయి. ప్రెజ్నెస్ కల్గుతుంది. చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి.
  10. వస్త్రధారణ: వస్త్రాలు శుభ్రమైనవి వేసుకోవాలి. కాటన్ దుస్తులు మంచివి, ఇతరుల అండర్వేర్ లు వాడకూడదు. కొంతమందికి చర్మవ్యాధులుంటాయి. వారిబట్టల ద్వారా ఒకరి నుండి ఒకరికి అవి సంక్రమిస్తాయి. దుస్తులు పచ్చివి, తడివి వేసుకోకూడదు. దుస్తులు ఉతికి బాగ ఎండలో ఆరిన తర్వాత వాడాలి. పచ్చివి, తడివి వాడటం వలన ఫంగస్ మరియు చర్మవ్యాధులు కల్గుతాయి. అండర్వేర్లు (లోపలిదుస్తులు) మధ్యాహ్నం లేదా సాయంత్రం తప్పక మార్చుకోవాలి.మంచి దుస్తులు వేసుకోవటం వలన ఉన్నతత్త్వం కల్గుతుంది. ఆకర్షణ కల్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎండ బారి నుండి రక్షణ కల్గుతుంది. కాటన్ దుస్తులు మరీ పొట్టి దుస్తులు ధరించటం ఫ్యాషన్ కావచ్చు కాని అవి మన గౌరవాన్ని పెంచలేవు.
  11. నఖ కేశములు మరియు అలంకరణ: తల వెంట్రుకలు, గడ్డము, మీసాలు, మర్మావయవాల వెంట్రుకలు అతిగా పెంచకూడదు. వీటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. గోళ్ళు అధికంగా పెంచకూడదు. గోళ్ళులోనికి మురికి చేరకుండా శుభ్రం చేసుకోవాలి. గోళ్ళలో మురికి చేరి బ్యాక్టీరియా క్రిములు ఆహారంతో పాటు లోనికి వెళ్ళి అనారోగ్యాన్ని కల్గచేస్తాయి.
  12. అలంకరణ: మితిమీరి అలంకరణ ఎబ్బెట్టుగా ఉంటుంది. కొన్ని రకాల సౌందర్య సాధనాల వల్ల ఎలర్జీ వ్యాధులు వస్తాయి. అలంకరణ సంఘంలో గౌరవాన్ని, మన్ననలను పొందే విధంగా ఉండాలి. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధాలు ఉపయోగించిన సుగంధయుక్తంగా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండ ఉంటాయి.
  13. అభరణాలు ధరించటం: ఆభరణాలు ధరించటం ఒక కళ. మణి, మాణిక్యాలు, బంగారు ఆభరణాలు ధరించాలి. ఆభరణాలు తమ అంతస్తు పెంచుకోవటానికో లేక గొప్పతనం చాటుకోవటానికో అధికంగా ధరించకూడదు. అలా చేయటం ఎబ్బెట్టుగా ఉండటమే కాకుండ అసహ్యాన్ని కట్టచేస్తాయి. అభరణాలు ఆతీంద్రియశక్తుల నుండి రక్షణ కలిపిస్తాయని జ్యోతిష్కులు సిద్ధులు చెబుతుంటారు. కొన్ని ఆభరణాలు కొందరికి ఎలర్జీ కలిగిస్తాయి. వాటిని మానివేయాలి.
  14. ఆహారం: పాలు, పళ్లు, ఆకుకూరలు, పప్పులు, కొవ్వు పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం షట్రుడుతో (పడ్రసాలతో) కూడి ఉండాలి. ఆహారం తమతమ జీర్ణశక్తిని గమనించి తీసుకోవాలి మాటిమాటికి ఆహారం తీసుకోవటం, మితిమీరి ఆహారం తీసుకోవటం మంచిది కాదు. కొవ్వు, మాంసం, స్వీట్సు మి మీరి (అధికంగా) తినటం మంచిది కాదు. ఆహార పదార్థాలపై మూతలు ఉండాలి.. పాచిపోయిన, కుళ్ళిపోయిన ఆహారం. ఈగలు వాలిన ఆహారం తినకూడదు. హర్రీ, బర్రీ, కర్రీ పనికి రావు. ఇవి అల్సర్ను కలిగిస్తాయి. బ్రతకటానికి మాత్రమే ఆహారం తినాలి. తినటానికే బ్రతికితే జీవితానికి అర్ధం పరమార్ధం లేదు. ఆహారాన్ని ఇష్టమైన వారితో కలిసి భుజించాలి. ఆహారము తినే సమయమున కోపము, విసుగు, చికాకు, ఏడుపు పనికిరావు. యజ్ఞంలా భావించి తినాలి. అతిధులకు ఆహారము ముందు పెట్టాలి. తర్వాతే మనము భుజించాలి.
  15. ఆహారానికి ముందు: అల్లం మరియు కొద్దిగా ఉప్పు కల్పి భోజనానికి 10-20 నిమిషాల ముందు సేవించాలి. (రక్తపోటు రోగులు ఉప్పు వాడకూడదు). ఆహారాన్ని మెత్తగా నమిలి మ్రింగాలి. ఆహారం మంచి రుచి కల్గి ఉండాలి. వేడిగా ఉండాలి. రాత్రి సమయాల్లో మితిమీరి భోజనం చేయకూడదు. పడుకోవటానికి 2 గంటలు ముందే భోజనం చేయాలి. ఆహారం భుజించిన తర్వాత కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవాలి. కొద్ది దూరం నిదానంగా నడవాలి. అంతేగాని ఉరుకులు, పరుగులు పనికి రావు.
  16. తాంబూళ సేవన: భోజనం తర్వాత 2 లేక 3 లేత తమలపాకులు తీసుకుని సున్నం, కాచు, వక్కలు, జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, లవంగాలు, మొదలగు వానితో కూడిన తాంబూళం సేవించాలి, ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. అంతే కాని జర్ధాలు, పాన్ మసాలాలు గుట్కాలను వాడకూడదు. వీటి సేవన వలన రకరకాల క్యాన్సర్లు వస్తాయి.
  17. నిద్ర : ప్రతి వ్యక్తికి నిద్ర చాల అవసరం. నిద్ర వలన శరీరశ్రమ అలసట తొలిగి నూతన శక్తి లభిస్తుంది. ఆరోగ్యవంతులకు దాదాపు 6 గంటల నిద్ర సరిపోతుంది. పగటి నిద్ర మంచిది కాదు అయితే చిన్న పిల్లలు, బలహీనులు, రోగులు, పగటినిద్ర పోవచ్చు. పడుకునేముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన చాల రిలాక్స్ గా ఉంటుంది. పడుకునేముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను త్రాగాలి. లేదా అశ్వగంధచూర్ణము 3గ్రాములు కలిపి త్రాగితే చక్కగా నిద్రపడుతుంది.
  18. మాట్లాడువిధము: ప్రియంగా మాట్లాడాలి. మనస్సుకు కష్టం కలిగే విధంగా మాట్లాడరాదు.
  19. మైధునము: సెక్స్ ఒక మధురమైన అనుభూతి. సెక్స్ ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. సెక్స్ జీవిత భాగస్వామితోనే ఆచరించాలి. తెలియనివారితో, అపరిచితులతో, వేశ్యలతో కలిసి చేయరాదు. సుఖరోగాలతో బాధపడే * స్త్రీ, పురుషులతో సెక్స్లో పాల్గొనరాదు. నెలసరి సమయమున కూడ సెక్స్లో పాల్గొనటము వలన చికాకు, అయిష్టత కలుగుతాయి. సెక్స్ను తనివితీరా అస్వాదించాలంటే మీ జీవితభాగస్వామితో అనురాగము, ఆప్యాయత, ఆరాధనా . భావనలను పెంపొందించుకోండి. సెక్స్ తర్వాత పాలు, పండ్లు సేవించండి. దీని ద్వారా శ్రమ తీరుతుంది. తృప్తి కలుగుతుంది. చికాకు, టెన్షన్లతో సెక్స్లో పాల్గొనకండి. అధిక మధ్యపానము చేసికూడ సెక్స్లో పాల్గొనకండి. భయము, ఆందోళనలు పనికిరావు. సెక్సు ముందు హృదయపూర్తిగా మాట్లాడుకోండి. చక్కని జోక్స్ వేసుకోండి. వాతావరణాన్ని ప్లెజెంట్గా ఉంచుకోండి. చిరుదివ్వె వెలిగించుకొని ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా హృదయానికి హత్తుకుంటూ మధుర భావనలను పంచుకుంటూ సెక్స్ను ఎంజాయ్ చేయండి. మరోసారి మనవి చేస్తున్నా- సెక్స్ ను మీ భాగస్వామితోనే ఆచరించండి. ఎయిడ్స్న దూరంగా ఉండండి.
  20. సమాజసేవ: మనసమాజములో ఎందరో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంతవరకు సహాయము చేయండి. ఆకలి, అవిద్య, రోగాలు, అధికజనాభా, ఇవి సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు. ఆకలితో ఉన్నవారికి కొద్దిగానైనా ఆహారాన్ని ఇవ్వండి. అవిద్య అనేక సమస్యలకు మూలము. ఇరుగుపొరుగు పిల్లలకు చదువురాని వాళ్ళకు చదువుచెప్పండి. వాళ్ళలో జ్ఞానజ్యోతులు వెలిగించండి.lets follow Good Health Tips For Daily Life.