Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆత్మకథ.. సెహ్వాగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్

Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆత్మకథ.. సెహ్వాగ్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్


నిజానికి ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఆ వివాదాలు ఎక్కువ కాలం ఉండవు. కాగా, ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తన ఆత్మకథలో రాసుకున్న ఓ ఘటన ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపింది. ప్రస్తుతం ఆర్ సీబీలో ఆడుతోన్న ‘గ్లెన్ మాక్స్‌వెల్-ది షోమ్యాన్’ పేరుతో విడుదల చేశాడు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి, ఇందులో ఐపీఎల్ 2017 సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడు. ఆ సమయంలో, పంజాబ్ జట్టులో అతని ప్రదర్శన ప్రారంభంలో అద్భుతంగా ఉంది. తద్వారా 2017 ఎడిషన్‌లో జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అదే సీజన్‌లో పంజాబ్ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

అయితే ఆ ఎడిషన్‌లో, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం 73 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు కేవలం 2 పాయింట్ల తేడాతో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయింది. ఆ మ్యాచ్ గురించి మాక్స్‌వెల్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ‘ఆ సమయంలో నేను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందున, మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశానికి వెళ్లి మీడియా నుండి ప్రశ్నలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. కానీ సెహ్వాగ్ నన్ను ఆపి తను ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ బస్సు ఎక్కి హోటల్ కు బయలుదేరాను. కానీ అప్పటికి నన్ను టీమ్ మెయిన్ వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించారు. అంతే కాదు, విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సెహ్వాగ్ నాపై కోపంగా ఉండటమే కాకుండా, కెప్టెన్‌గా బాధ్యత వహించడం లేదని ఆరోపించాడని నాకు మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

‘ఇది నాకు షాకింగ్‌గా ఉంది. సెహ్వాగ్‌కి వీరాభిమాని అయిన నేను ఆ వ్యాఖ్యలతో బాగా బాధపడ్డాను. కాబట్టి వెంటనే నేను, మీ ప్రకటనలు నన్ను చాలా బాధించాయి. మీరు మీ పెద్ద అభిమానులలో ఒకరిని కోల్పోయారని సెహ్వాగ్ కు మెసేజ్ పంపించాను. అయితే ఈ మెసేజ్‌కి సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘మీలాంటి అభిమాని నాకు అవసరం లేదు’ అని నాకు తిరిగి మెసేజ్ చేశాడు. అప్పటి నుంచి నాకు, సెహ్వాగ్ మధ్య నాకు మాటల్లేవు. దీని తర్వాత, నేను జట్టు యజమానితో మాట్లాడి, సెహ్వాగ్ జట్టులో కొనసాగితే, నన్ను ఎంపిక చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాను. తదుపరి సీజన్ తర్వాత సెహ్వాగ్‌ని జట్టు నుంచి తప్పించినట్లు మ్యాక్స్‌వెల్ తన ఆత్మకథలో రాసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *