Emesis వమనము(వాంతి చేయించటం)In Panchakarma పార్ట్ 2

Emesis వమనము(వాంతి చేయించటం)In Panchakarma పార్ట్ 2

శోధన చికిత్సలో విశిష్ట స్థానము ఇవ్వబడిన చికిత్స ప్రక్రియ Emesis వమనము(వాంతి చేయించటం). శరీరంలో రోగ కారక పదార్ధాలను బయటికు వెడలించు ప్రయత్నంనకు. శోధన చికిత్స అని పేరు. ఆయుర్వేద మూల సిద్ధాంతాలయిన త్రిదోషములలో కఫదోష సంబంధాలైన వ్యాధులకు చికిత్సగా వమనకర్మ నిర్దేశింపబడినది. అనగా కేవలము కఫదోషము మాత్రమే కాక కఫము అనుబంధంగా ఉన్న పిత్త, వాత మొదలగు సందర్భములలో కూడ వమన చికిత్స సూచించబడినది. అంతే కాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడ కఫ సంబంధము లేకున్నను వమనం చేయమని సూచింపబడటం గమనార్హము.

Emesis వమనము:

కలుషిత ఆహారం తీసుకున్నపుడు, విషప్రయోగము జరిగినపుడు పాము, తేలు, మదలగు ఇతర విష కీటకములు, అంతువుల దాడికి గురిఅయినపుడు, విషపూరితములైన శస్త్రాదులచే అభిమాతములు కల్గినపుడు తిన్న ఆహారము జీర్ణము ‘కాక లోపటి ఉన్నపుడు ఫిట్స్, కొన్ని జ్వరాలు, మానసిక వ్యాధులు, క్షయన్నాని. గుదమార్గం ద్వారా జననేంద్రియముల ద్వారా రక్త స్రావము కల్గినపుడు, స్థూలురకు, ఉబ్బసము, దగ్గు, ఉద క్షతము, విసర్పము, కుష్ఠము, చర్మవ్యాదులు, చెవి, ముక్కు గొంతువ్యాధులు, ఎలర్జీ సంబంధ వ్యాధులందు ఈ ప్రక్రియ ప్రయోజనకరంగా చెప్పబడినది.

Emesis వమనానికి అనర్హులు: గర్భిణీ స్త్రీలు, బాబురు, వృద్ధులు, ఎపుడు దుఃఖించు

స్వభావము కలవారు, కృశించినవారు, హృద్రోగము, ఇతర హృదయ సంబంధ వ్యాధులు కలవారు, కడుపులో నులిపురుగులు లాంటివి కలవారు, ప్లీహ సంబంధ వ్యాధులు కల్గినవారు, ప్రక్కన నొప్పి, అర్షమొలలు కలిగిన వారికి వమన కర్మ చేయకూడదు.

వమనకర్మ విధానము: Emesis (వమనం) చేయించటానికి ముందు పూర్వకర్మలయిన స్నేహ. స్వేదములు చేయించాలి. ముందు రోజు రాత్రి రోగికి మినుములు, నువ్వులు, చేపలతో కూడిన ఆహారం ఇస్తారు. దీని వలన శరీరంలో కఫం బాగ వృద్ధి పొందుతుంది.. రోగికి మనకర్మ చేయించడానికి 12 గంటల ముందు రోగానుసారము పాలు, చెరుకురసం మొదలగునవవి కడుపునిండా త్రాగిస్తారు. తర్వాత రోగిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి రోగము యొక్క తీవ్రతను బట్టి యష్టిమధు తెనే సైంధవలవణము మదనఫలము పాలు మొదలగు వానిని కల్పి ఔషదాన్ని త్రాగించి వమనము చేయిస్తారు. తేనె+ సైంధవలవణం కలిపి ఔషధాన్ని త్రాగిస్తారు.

  1. వమనము: 2, రోగికి వమన చికిత్స ఇచ్చేటపుడు వైద్యుడు రోగి ప్రక్కనే ఉండి రోగి తలను, ప్రక్కలందు పట్టుకొని ఎక్కువ శ్రమ లేకుండ తేలికగా వమనం జరిగేలా దోహదపడాలి. కఫ దోషం ప్రధానంగా ఉన్న రోగాల్లో వేడిగా ఉండే ఔషధం ఇస్తారు. వమనము ద్వారా కఫం అంతా బయటికి పోయి, పైత్యరసం బయటకు వచ్చే వరకు చేయిస్తారు. తర్వాత రోగి ముఖంపై చన్నీళ్లు చిలకరించి సేదతీర్చి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించి, బియ్యం రవ్వ జావలాంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇస్తారు.

ఈ వమనకర్మ వలన అతి నిద్ర, కునికిపాటు, దగ్గు, నోటి దుర్గంధము, నోరు జిగటగా ఉండడం. నోటి నుండి కఫం వెడలటం,గ్రహణి మొదలగు రోగములు తగ్గి ఆహార మందు ఇష్టం ఏర్పడి, రుచి మొదలగునవి కలుగుతాయి.

  1. విరేచనము: వమనము వలనే విరేచనము కూడా చాల ప్రశస్తమైన ప్రక్రియగా పంచకర్మలలో పేర్కొనబడినది. ఇది ప్రధానంగా పిత్తదోషసంబంధ వ్యాధుల్లో సూచించబడినది. గుల్మము, ఫైల్స్, (ఆర్షస్సు), మంగు, కామెర్లు, జ్వరము, ఉదరము, విషప్రయోగము, వాంతులగుట, ప్లీహవృద్ధి, విద్రది, పక్వాశయమున కలుగు బాధలు, యోని సంబంధ రోగాలు, శుక్ర సంబంధ దోషములు. క్రిమిరోగాలు, వ్రణములు, మలబద్ధకం, మూత్రసంబంధ దోషములు, వ్రణములు మూత్రసంబంధ రోగాలు, కొన్ని రకాలు చర్మవ్యాధుల్లో విరేచనకర్మ సూచించబడినది.

విరేచనానికి అనర్హులు: ఆకలి, జఠరాగ్ని మందగించినవారు, అతిసార వ్యాధితో బాధపడేవారు, సుకుమారులు, క్షయరోగములు కలవారు విరేచన కర్మకు పనికిరారు.

విరేచనకర్మ విధానము: ప్రత్యేకించి నిర్దేశించిన సందర్భంలో తప్ప సామాన్యముగా విరేచనమునకు ముందు రోగికి వమనం చేయించాలి. వమనము అయిన 15 రోజులకు తైలంతో అభ్యంగం చేసి స్వేదకర్మకావించి సూర్యోదయమైన నాలుగు గంటల తర్వాత రోగి బలము, రోగము యొక్క తీవ్రత గమనించి విరేచన ద్రవ్యాన్ని రోగికి తగమాత్రలో ఇస్తారు. విరేచనం అయిన పిదప సేదతీర్చి అతని జాఠరాగ్ని బలమును అనుసరించి జావ, గంజి మొదలగు తేలికగా జీర్ణమయ్యే ఆహారము ఇస్తూ 5వ రోజు నాటికి మామూలు ఆహారం ఇస్తారు.

ఈ విరేచనకర్మ వలన జఠరాగ్ని దీప్తి కల్గుతుంది. శరీరపటుత్వం, బుద్ధి సూక్ష్మత, కల్గుతుంది. ముసలితనం తొందరగా రాదు.

3.వస్తికర్మ:

panchakarma (పంచకర్మ) చికిత్సలో అత్యంత ప్రధానమైనది, అతి ముఖ్యమైనది వస్తికర్మ. ఇది ప్రధానంగా వాతదోషము కలవారికి ఉద్దేశించబడినది. ఇది సర్వరోగనివారిణి లాంటిది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారము వస్తికర్మ వలన తగ్గని వ్యాధి లేదంటే అతిశయోక్తి కాదేమో! ఈ చికిత్స శరీరంలో ఒక నూతనోత్తేజాన్ని ఉత్సాహాన్నికల్గచేస్తుంది. ఈ వస్తికర్మ 3 రకాలుగా చెప్పబడింది.

  1. నిరూహవస్తి: కషాయము, పాలు, మొదలగు వాని ద్వారా చేయునది.
  2. అనువాసనవస్తి: తైలములు, నెయ్యి మొదలగు వానితో చేయునది.
  3. ఉత్తరవస్తి: జననేంద్రియ మార్గముల ద్వారా చేయునది.

ఇవి కాక కాల, కర్మ, ప్రసన్న, శోదన, శమన, లేఖన, బృంహణ మొదలగు అనేక పేర్లతో వస్తి కర్మ వివరించబడినది. వస్తి కర్మ సంఖ్య, ఔషధమోతాడు, చేయు సమయము వ్యవధి అనుసరించి ఇన్ని పేర్లు ఉన్నప్పటికి ప్రధానంగా పైన తెలుపబడిన మూడు తరగతుల కోవలోకే వస్తాయి.

మూత్ర ద్వారము, మలద్వారము, యోనిద్వారము ద్వారా వివిధ ఔషధములను అను శరీరంలోనికి ప్రవేశపెట్టుటయే వస్తి కర్మ అంటారు.

  1. నిరూహవస్తి: దీనినే కషాయవస్తి లేదా ఆస్థాపన వస్తి అని కూడ అంటారు. ఇది కష్టసాధ్యమైన వాత వ్యాధుల్లో ప్రయోగిస్తారు. గుల్మవ్యాధి, కడుపుబ్బరము, ప్లీహవ్యాధి, అతిసారం, కడుపునొప్పి, చాలాకాలంగా ఉన్న జ్వరము, జలుబు, మలబద్దకము, శుక్రసంబంధ వ్యాధులు, బహిష్టు సరిగా వెడలకపోవటం, మూత్రనాళంలో రాళ్ళు మొదలగునవి ఉన్నపుడు ఈ నిరూహవస్తి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే బాగా కృశించిన వారికి, వమనము, ఎక్కిళ్ళు, ప్రమేహము, దగ్గు, ఆయాసము, మొలలు, కుష్ఠురోగం, మధుమేహం కలవారు, అపుడే భోజనం చేసినవవారికి గుదస్థానమున వాపు, కురుపులు కలవారు, గర్భిణీ స్త్రీలు, జలోధరము కలవారికి ఈ నిరూహవస్తి చేయకూడదు.

ఈ నిరూహవస్తిని ఉదయం 10-12 గంటల ప్రాంతంలో చేయాలి. రోగికి ముందుగా స్నేహ, స్వేదములు చేయించి, కొద్దిగా ఆకలితో ఉన్నప్పుడు ఔషధ ద్రవ్యాన్ని గోరువెచ్చగా చేసి ఇస్తారు. వస్తిరూపంలో ఇచ్చిన ఔషదం మొత్తము బయటికి వచ్చిన తర్వాత రోగికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పాలు, మాంసరసంతో కూడిన ఆహారం ఇస్తారు.

2. స్నేహవస్తి: దీనికే అనువాసనవస్తి అని పేరు. ఇది కూడ నిరూహవస్తిలో సూచించిన ప్రకారమే చేస్తారు కాకుంటే దీనిలో కషాయంకు బదులు తైలము (నూనె)
మొదలగు స్నేహ ద్రవ్యాలను వాడుతారు. అయితే ఈ స్నేహవస్తిని రక్తహీనత, వచ్చకామెర్లు, క్షయ, ఆహారం లేక క్షీణించినవారు ప్లీహవృద్ది, మలబద్దత, కఫరోగం, జలుబు, కృశించిన వారికి, విపాహారం సేవించిన వారికి, శ్రీపదం(బోదకాలు) కలవారికి ఈ వస్తి ప్రక్రియ చేయకూడదు.

ఈ కర్మలో రోగికి తైలంతో అభ్యంగనం చేసి, వెచ్చని నీటితో స్నానం చేయింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇప్పించి కొద్ది సేపు అటు ఇటూ పచార్లు చేయింది. కాలకృత్యములు తీర్చుకున్న రోగిని ఎడమవైపుకు పడుకోబెట్టి, కుడికాలు ముడుచుకునేలా చేసి మల ద్వారము ద్వారా ఔషదాన్ని లోపలికి ప్రయోగిస్తారు. తరువాత రోగిని వెల్లకిలా పరుండబెట్టం జరుగుతుంది.

  1. ఉత్తరవస్తి: ఇది సాధరణంగా మూత్రసంబంధ వ్యాధులందు ఆచరిస్తారు. అయితే గర్భాశయ వ్యాధుల్లో ఇది మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది. మగ వారిని మోకాలి ఎత్తుపీటపై కూర్చుండబెట్టి మూత్రనాళం ద్వారా ఔషదాన్ని ప్రయోగిస్తారు. స్త్రీలను వెల్లకిలా పడుకోబెట్టి జననేంద్రియముల ద్వారా ఔషదాన్ని ప్రయోగిస్తారు.
  2. మాత్రవస్తి: ఇది కూడ పైన పేర్కొన్న వస్తి చికిత్సలాంటిదే. కాని దీనిలో ఔషధాన్ని చాల స్వల్ప మాత్రలో(25-100మి.లీ) ప్రయోగిస్తారు. ఇది అన్ని వయసుల వారు ఆచరించవచ్చు. దీనికి స్నేహ, స్వేదాలతో పనిలేదు. దీనివలన ఆకలి, ఉత్సాహము పెంపొందుతాయి.

4. నస్యకర్మ:

నాసామార్గం ద్వారా ఔషదాన్ని ప్రయోగించడాన్ని నస్యకర్మ అంటారు. ఈ ప్రక్రియ శిరస్సు, మెడ యందలి రోగములకు కారణములైన దోషతత్వాన్ని బయటికి వెడలించటానికి ఉద్దేశించబడినది. దీనినే శిరోవిరేచనం అని కూడ అంటారు. ఇది కూడ శిరస్సు, మెడ యందలి దోషములను శోధించుటకు ఉద్దేశించబడిన శోధన చికిత్సా ప్రక్రియ. ఈ నస్యకర్మలో ఉపయోగించిన ద్రవ్యము దాని ధ్యేయము, క్రియ. ద్రవ్య ఆధారము, ప్రయోగవిధానమును బట్టి అనేక రకాలుగా వర్గీకరించినప్పటికి చరకుడు చెప్పి 5 రకాల వర్గీకరణయే ప్రధానంగా ప్రస్తుత వైద్యనిపుణులు అనుసరిస్తున్నారు.

  1. నావనము: ఇది విభిన్నములైన చెవి, ముక్కు, గొంతు సంబంద వ్యాధులను చికిత్సించటంలో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ వలన మెడకు, భుజములకు, ఉర ప్రాంతములకు బలం చేకూరి, దృష్టి మెరుగుపడుతుంది.
    2. అవపీదనము: దీనిలో అప్పటికప్పుడు ఔషధముల నుండి దంబితీసిన స్వరసం లేదా రసంను ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా గొంతుకు సంబంధించిన వ్యాధుల్లో, మానసిక రోగంబందు ఉపయుక్తంగా ఉంటుంది.
  2. ప్రథమనము: ఈ పద్ధతిలో ఔషధంను చూర్ణరూపంలో ప్రయోగిస్తారు. ఇది ముఖ్యంగా మానసిక వికారములు, విషసంబంధ వ్యాధులలో అత్యంత ఉపయోగంగా ఉంటుంది.
  3. ధూమనస్యము: ఇది ముఖ్యంగా మెడ, శిరస్సుకు సంబంధించిన వ్యాధుల్లో ప్రయోగిస్తారు. దీనిని ధూమ (పొగ) రూపంలో ప్రయోగిస్తారు.

5.ప్రతిమర్మనస్యము:

ఔషధముగా స్నేహ ద్రవ్యములు ఉపయోగించిన అదిప్రతిమర్శనస్యం అనబడును. ప్రతి మర్మనస్యంలో ఔషధ మోతాదు ఎక్కువ మాత్రలో ఉంటుంది. ఈ పద్ధతి సర్వకాల సర్వావస్థలయందు అన్ని వయస్సుల వారికి ఉపయోగించతగినదిగా ప్రశస్తి పొందినది.

విధానము: నస్యకర్మను ఆచరించటానికి ముందు రోగి యొక్క బలాన్ని అనుసరించి స్నేహ, స్వేద, అభ్యంగాలను ఆచరించి రోగిని బల్లపై వెల్లకిలా పరుండబెట్టి తలను కాస్త వెనక్కు వంగేలా ఉంచుతారు. ఒక నాసారంధ్రమును మూసి, వేరొక రంద్రంలో ఔషధం పోసి రోగిని పీల్చమని చెప్పాలి. తర్వాత రోగిని ఔషధం బాగా పీల్చమని చెప్పి నోటిలోనికి వచ్చిన ఔషదాన్ని (మందును) ఉమ్మివేసిన తర్వాత రోగి నుదురు, చెవులు, మెడ, బుగ్గలు(చెంపలు) భుజములు, చేతులు పాదములను మృదువుగా మర్దిస్తారు. ఈ విధంగా చేస్తూ 100 లెక్క పెట్టేవరకు రోగిని పడుకోబెట్టి తర్వాత వేడి నీటితో నోరు పుక్కిలించి తర్వాత తేలికపాటి ఆహరం ఇస్తారు.

నన్యకర్మ ద్వారా ఔషధం శిరస్సునందలి మారుమూల ప్రదేశములు, సూక్ష్మస్రోతస్సులలో దాగి ఉన్న దోషములను బయటికి వెడలించి కళ్ళు, ముక్కు చెవులు గొంతు, మెడకు సంబంధించిన వ్యాధి కారములైన అంశములను శోధించి స్వస్థత చేకూరుస్తుంది.

రక్తమోక్షణము (Blood Letting): దీనిని రక్తదోషములందు ముఖ్యంగా బోధకాలు, చర్మవ్యాధులయిన కుష్ఠము, విసర్పము, సొరియాసిస్ లాంటి వ్యాధులందు ఆచరిస్తారు. ఇది 2 విధములు శస్త్ర ప్రయోగము – ప్రచ్చన (Incision) మరియు శిరోవేదనము (Venepunctures).

అనుశస్త్ర ప్రయోగము: ఉదా: జలూక ప్రయోగము Leach application- జలగలను వ్యాధిగ్రస్థ భాగమును పట్టించుట శృంగ Application of form for tapplication of Alahu for lupping): 1 ລ້ (cupping with Gatam) అలదూ

జలూక ప్రయోగము : each application, రక్తదోషములందు జలూకలను పట్టించి చికిత్స చేయుట అనాదిగా భారతదేశమున జరుగుతున్నదే. ఇది అత్యంత ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. మన దేశములోనే కాదు జపాన్, జర్మనీలాంటి దేశములందు కూడ వీటి ప్రయోగము కలదు. జలగలను పరిశుభ్రమైన/స్వచ్ఛమైన జలము ఉండే సరస్సులు మొదలగు వాని నుండి గ్రహిస్తారు. చికిత్స చేయవలసిన రోగి యొక్క శరీరభాగమున తేనె/నెయ్యి చుక్కలు వేసి చిన్నగా Incision ఇచ్చి జలగ (Leach)లను ఆ ప్రాంతమున ఉంచి Vitiated Blood ను పీల్చటానికి ఉపయోగిస్తారు. తదనంతరము దానిని తొలగించి జలగ పీల్చిన ప్రాంతమును చల్లని నీటితో చక్కగా శుభ్రపరచి ఆ ప్రాంతమునందు Cotton లేదా నెయ్యినందు ముంచిన Gauz గాని పెట్టి కట్టువేస్తారు. ఇది చక్కని సులభమైన ప్రక్రియ.

మొదటి పార్ట్ చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు ఇక్కడ క్లిక్ చేయండి