Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది? టీజర్ వీడియో..!

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది? టీజర్ వీడియో..!


Royal Enfield Bear 650: రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయబోతోంది. అలాగే వాటిలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు మొదటి స్క్రాంబ్లర్ బైక్ కూడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రాబోయే మోటార్‌సైకిల్‌కు బేర్ 650 అని పేరు పెట్టింది కంపెనీ. దాని లీకైన టీజర్ కూడా బయటకు వచ్చింది. 650 cc సెగ్మెంట్ ఈ రాబోయే మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 తేలికపాటి, ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వెర్షన్‌గా పరిగణిస్తున్నారు. ఇది గొప్ప లుక్స్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 లుక్, ఫీచర్ల గురించి .. నియో-రెట్రో డిజైన్‌తో ఉన్న ఈ మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కాంపాక్ట్ రియర్ డిజైన్, రెట్రో లుకింగ్ ఇండికేటర్‌లు, సింగిల్ పీస్ సీట్ సెటప్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు స్టీల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, సింగిల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 5 అంగుళాల ట్రిప్పర్ డాష్ ఉంటాయి. బేర్ 650లో గూగుల్ మ్యాప్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు. రాబోయే రోజుల్లో ఈ బేర్ 650 గురించి మరిన్ని సమాచారం వెల్లడి కానుంది.

ఇది కూడా చదవండి: Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఇంజన్, పవర్ గురించి చెప్పాలంటే, కంపెనీకి చెందిన ఇతర 650 సిసి మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఇది 648 సిసి ప్యారలల్ ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుందిజ ఇది గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ని, 52 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండనుంది. ఈ బైక్ సింగిల్, డ్యూయల్ టోన్ వంటి రెండు రంగుల్లో లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరిగిందని, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రాబోయే బేర్ 650 ద్వారా ప్రజలకు మెరుగైన ఎంపికను అందించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. Bear 650 ఇటీవల విడుదల చేసిన BSA గోల్డ్‌స్టార్‌తో పాటు ట్రయంఫ్, ఇతర కంపెనీల నుండి 650 cc బైక్‌లతో పోటీపడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నవంబర్ 4న ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Gold Buying: భారత్‌లో బంగారం కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి? చైనాను అధిగమించిన ఇండియా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *