Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్


Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా ఇది. ఇక దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా దేవర 1 సినిమా రేపు (నవంబర్ 8న) ఓటీటీలోకి రానుంది.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అలాగే అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటారు ఎన్టీఆర్. అయితే ఆయన సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి యమదొంగ సినిమా చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “రాజమౌళి నా దగ్గరకు వచ్చి ఓ టైటిల్ చెప్తాను ఎలా ఉందో చెప్పండి అన్నారు.. సరే అన్నాను.. యమదొంగ అన్నారు.. ఇదేంటి జక్కన్న అని అడిగాను. యమగోల సినిమాను మనం మళ్లీ తీస్తున్నాం తారక్ అన్నారు. యమగోల సినిమా మళ్లీ తీస్తున్నాం అనగానే ఆనందం కంటే ఓ షాక్, చిన్న భయం. మరి యముడి పాత్ర ఎవరు చేస్తారు అని అడిగాను. మీ ఒపీనియన్ లో ఎవరున్నారు అని ఇద్దరం మాట్లాడుకుంటుంటే.. ఇంకెవరున్నారు. యముడిగా చేసే ఏకైక మొనగాడు మోహన్ బాబుగారు ఒక్కడే  అని అన్నాను. ఆయన తప్ప ఎవరూ చేయలేరు.. మరి ఆయన చేస్తారో లేదు అని డౌట్ జక్కన్న అని చెప్పను. రాజమౌళి వెళ్లి అడిగినప్పుడు దర్శకుడు నువ్వు కాబట్టి హీరో తారక్ కాబట్టి ఈ సినిమా నేను చేస్తున్నా అని మోహన్ బాబు అన్నారు. ఒక విధంగా అది ఆయన ఇచ్చిన వరం అనుకోవాలి. అందరూ ఆయన గురించి తప్పుగా అనుకుంటారు. చాలా కోపం, ముక్కు మీద కోపం, ముక్కు సూటి మనిషి అని .. అబద్దం మాట్లాడటం చేతకాని, నిజం తప్పా.. ఏమీ మాట్లాడటం చేతకాని మనిషి మోహన్ బాబు” అని అన్నారు తారక్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

 

View this post on Instagram

 

A post shared by Tarak9999edits (@tarak9999edits)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *