Pink Salt: పింక్‌ సాల్ట్‌ అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటంటే..

Pink Salt: పింక్‌ సాల్ట్‌ అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటంటే..


ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. దీంతో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న నిపుణులు సూచనల మేరకు ఉప్పును తీసుకోవడం తగ్గిస్తున్నారు. అదే సమయంలో పింక్‌ సాల్ట్‌ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పింక్‌ సాల్ట్‌ లేదా రాక్‌ సాల్ట్‌గా పిలుచుకునే ఈ ఉప్పు ప్రత్యేకత ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సముద్రం లేదా సరస్సు నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ పింక్‌ కలర్‌ క్రిస్టల్స్‌గా ఏర్పడుతుంది. హిమాలయన్ రాక్ సాల్ట్ వంటి ఇతర రకాలు కూడా ఉన్నాయి. సాధారణ ఉప్పుతో పోల్చితే ఈ పింక్‌ సాల్ట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పింక్ సాల్ట్‌ను సాధారణ దగ్గు, జలుబు, కంటి దృష్టి, జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది. పింక్‌ సాల్ట్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులివే..

* జీర్ణక్రియను మెరుగుపరచడంలో రాక్‌ సాల్ట్‌ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గట్ హెల్త్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు, డయేరియా నియంత్రణకు పింక్ సాల్ట్ ఎంతగానో సహాయపడుతుందని అంటున్నారు.

* నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో రాక్‌ సాల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే ఎలక్ట్రోలైట్స్‌ మజిల్ క్రాంప్‌ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

* ఆయుర్వేదంలో కూడా పింక్‌ సాల్ట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటుంటారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. చర్మాన్ని రిజ్యువనేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

* పింక్‌ సాల్ట్‌లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ ఇతర మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

* సాధారణ సాల్ట్‌తో పోల్చితే పింక్‌ సాల్ట్‌లో సోడియం కంటెంట్‌ తక్కువగా ఉంటుంది. దీంతో రక్తపోటు సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండడంలో దోహదపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *