రామ్ చరణ్‌కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం.. ఆయన సినిమా వచ్చిందంటే ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 1200 స్క్రీన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఇప్పటికే జనవరి 10న గేమ్ ఛేంజర్ అంటూ డేట్ లాక్ చేసారు నిర్మాతలు.
మిగిలిన మూడు సినిమాలు మాత్రం సంక్రాంతి పండక్కి వస్తున్నామని చెప్పారు కానీ డేట్స్ చెప్పలేదు. జనవరి 10 నుంచి 15 మధ్యలోనే అన్ని సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
జనవరి 10న గేమ్ ఛేంజర్ వస్తే.. దాన్ని బేస్ చేసుకుని ముందు వెనక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఉదాహరణకు NBK109 జనవరి 11 లేదంటే 13కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వెంకీ సినిమాను జనవరి 14న ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది.
మరి ఇక సందీప్ కిషన్ మజాకా అన్నింటికంటే చివరగా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలన్నింటినీ బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తున్నారు. ఈ లెక్కన ఎవరికీ థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు.
కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినపుడు కచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానివల్ల వసూళ్లు కూడా దారుణంగా తగ్గిపోతుంటాయి. 2025 సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా.. కలెక్షన్లపై ఈ ప్రభావం అయితే పడటం ఖాయం.