Kitchen Hacks: ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించి తక్కువ నూనెతో ఆహరాన్ని తయరు చేసుకోండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kitchen Hacks: ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించి తక్కువ నూనెతో ఆహరాన్ని తయరు చేసుకోండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..


ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే నేటి యువతకు ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడం కష్టం అని చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు ఎక్కువ నూనె ఉన్న ఆహార పదార్ధాలను తినొద్దు. అయితే తక్కువ నూనేతో రుచికరంగా ఆహర పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు తక్కువ నూనెతో రుచికమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ చిట్కాలు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ స్టిక్ వస్తువులున్నాయి. ఈ నాన్ స్టిక్ పాన్ లో తక్కువ నూనెని ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని వండుకోవచ్చు. దీనికి కొద్దిగా నూనె చాలు. ఆహారం బాగా ఉడుకుతుంది. అందువల్ల నూనె ఎక్కువగా ఉపయోగించి తయారు చేసుకునే ఆహారపదార్థాల తయారీకి నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చు.

కూరలు తయారు చేసుకునే పాత్రలో నేరుగా పాన్ లోకి నూనె పోయవద్దు. ఒక చెంచా లేదా కొలిచే కప్పును ఉపయోగించి పాన్ లోకి నూనె పోయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన తక్కువ నూనేతోనే వంట చేసుకోవచ్చు. రుచికరమైన వంటలు రెడీ.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కనుక పాత్రలో నేరుగా నూనె పోయవద్దు. ఇలా చేయడం వలన తెలియకుండానే ఎక్కువ నూనె పడిపోవచ్చు.

ఇవి కూడా చదవండి

వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే శరీరంలోకి తక్కువ నూనె వెళ్తుంది. కనుక వేయించిన ఆహారం బదులుగా ఉడక బెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి.

ఆవిరిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవడం వలన అదనపు నూనె అవసరం లేకుండా పోషకాలతో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఆవిరితో కూరగాయలు, చేపలు, కుడుములు వంటి అనేక రకాల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. చేపలు, మాంసం, గుడ్లు తక్కువ నూనె.. మసాలాలను వేసి ఆవిరితో ఉడికించి తినవచ్చు.

గ్రిల్లింగ్ చేసి ఆహారం తయారు చేసుకోవచ్చు. అధిక నూనె అవసరం లేకుండా గ్రిల్లింగ్ చేసి ఆహారం తయారు చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్‌ అందిస్తుంది. లీన్ మాంసాలు, కూరగాయలు, పండ్లను కూడా వండడానికి ఇది ఒక గొప్ప పద్ధతి.

బేకింగ్ అనేది కేక్‌ల తయారీకి మాత్రమే కాదు. ఇది తక్కువ నూనెతో వివిధ రకాల వంటకాలను చేయడానికి కూడా అనుసరించే ఒక వంట శైలి. ఈ పద్ధతిలో మాంసాహారం, కూరగాయలతో కూడా వంటలు చేసుకోవచ్చు.

ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఆహారంలో వంటనూనె వాడకం తగ్గించుకుని టేస్టీ టేస్టీగా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *