అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..

అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..


అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..

చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. ఆ వయస్సు.. ఈ వయస్సు అనిలేకుండా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే ఆ చిన్నారి కుప్పకూలింది.. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. ఆ పసిపాప కన్నుమూయడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి ప్రహర్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం, ఎమ్ వెంకటాయపాలెంలో చోటుచేసుకుంది.. కళ్ల ముందు ముద్దుగా మాటలు చెబుతూ ఆడుతూ గెంతులేసే.. ప్రహర్షిత.. ఒక్కసారిగా కుప్పకూలింది.. ముందుగా.. ప్రహర్షిత.. ఛాతీలో నొప్పి ఉందమ్మా.. ఆసుపత్రికి తీసుకు వెళ్ళండి అని అమ్మకు చెప్పింది.. వెంటనే ఆయాస పడుతూ కుప్ప కూలింది..

ఆందోళన చెందిన తల్లి తండ్రులు వెంటనే గ్రామంలో ఉన్న స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్ళారు.. సీపీఆర్ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.. దీంతో స్పృహ తప్పి పడిపోయిన ప్రహర్షితాను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందింది.

ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరగిపోయింది.. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ప్రహర్షిత స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది.. ఇంట్లో, స్కూల్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుందని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి క్షణాల్లో కుప్ప కూలి చనిపోవడంతో తల్లి తండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న ఒక్క కూతురు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.. కాగా.. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *