Delhi: 62 మందిని చంపిన అరివీర భయంకర ఉగ్రవాది.. 11 ఏళ్ల తర్వాత జైలు నుంచి అమ్మకు ఫోన్

Delhi: 62 మందిని చంపిన అరివీర భయంకర ఉగ్రవాది.. 11 ఏళ్ల తర్వాత జైలు నుంచి అమ్మకు ఫోన్


దేశవ్యాప్తంగా ఎన్నో బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడుగా ఉన్నాడు యాసిన్ భత్కల్. బెంగళూరులో బత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ 2009 నుండి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నో పేలుళ్ల కేసులో మాస్టర్ మైండ్. ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థకి కో ఫౌండర్ కూడా. అతడితో పాటు అతని సోదరులు రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్ కూడా ఎన్నో పేలుళ్లకు వ్యూహాలు రచించారు.

2013లో దిల్‌షుక్ నగర్ పేలుళ్ల కేసులోనూ యాసీన్ బత్కల్ కీలక సూత్రధారి. దిల్‌షుక్ నగర్ బస్ స్టాప్‌తో పాటు టిఫిన్ సెంటర్లోనూ జరిగిన పేలుళ్ల కేసులో యాసిన్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. పేలుళ్ల తర్వాత యాసిన్ కోసం దేశ విదేశాల్లోనూ కేంద్ర బలగాలు వెతికాయి. ఎట్టకేలకు నేపాల్ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2013 ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన యాసిన్ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నాడు. 2013 నుంచి అతను జైలు జీవితం గడుపుతూనే ఉన్నాడు. అనేక రాష్ట్రాల పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని వివిధ కేసులలో ఇప్పటికీ ఇంకా విచారిస్తూనే ఉన్నారు. జైల్లో ఉన్న సమయంలో అతని కలిసేందుకు యాసిన్ కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రయత్నించారు. కానీ అప్పటినుండి ఇప్పటివరకు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు యాసిన్ ఇష్టపడలేదు. జైల్లో ములాఖత్‌కు కుటుంబ సభ్యులు వచ్చినా కూడా వారిని కలవకుండా వెనక్కి పంపించేవాడు. ఇప్పుడు అనూహ్యంగా తన తల్లి అనారోగ్య బారిన పడిందని తెలుసుకున్న యాసిన్ ఆమెను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు.

అయితే బత్కల్ ప్రాంతానికి వెళ్లాలంటే ఢిల్లీ నుంచి దాదాపు 2000 కిలోమీటర్లు ఉంది. ఇంత దూరం యాసిన్‌ను పెరోల్‌పై పంపిస్తే అతడు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకి తెలిపారు. దీంతో అతని తల్లితో వీడియో కాల్ మాట్లాడేందుకు అనుమతించాలని జైలు అధికారులకు డిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అది కూడా జైలు అధికారులు ఇచ్చిన ఫోన్లో నుండి మాత్రమే వీడియో కాల్ మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.  ఇప్పటివరకు యాసిన్ జరిపిన బాంబు పేలుళ్లలో అధికారికంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *