ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటంటే.
సాధారణంగా ఎవరైనా మనకు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తే వాటిని ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో వాయిస్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం ఇబ్బందికరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్‌ను చదువుకునే విధంగా మార్చుకోవచ్చు. అంటే వాయిస్ మెసేజ్ చెప్పిన విషయాన్ని టెక్ట్స్ రూపంలో మార్చేస్తోందన్నమాట.
ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడానికి ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం చాట్స్ ఆప్షన్లో కనిపించే వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ అనే ఫీచర్‌ను కనిపిస్తుంది.
అక్కడ ఆన్/ఆఫ్ ఆప్షన్స్త పాటు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం కేవలం ఇంగ్లీష్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలలో, ఐఓఎస్ యూజర్లకు ఎక్సట్రాగా అరబిక్, ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్, జర్మన్, జాపనీస్ భాషల్లోనే అందుబాటులో ఉంది.