Abhinav Manohar IPL Auction 2025: రూ. 30 లక్షలతో ఎంట్రీ.. కట్‌చేస్తే.. అన్‌క్యాప్ట్ ప్లేయర్‌పై కోట్ల వర్షం..

Abhinav Manohar IPL Auction 2025: రూ. 30 లక్షలతో ఎంట్రీ.. కట్‌చేస్తే.. అన్‌క్యాప్ట్ ప్లేయర్‌పై కోట్ల వర్షం..


దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకునే ప్రదర్శనల నేపథ్యంలో, అభినవ్ మనోహర్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం చేసుకుని IPLలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదల్లేదు. మనోహర్ తన బలమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కేవలం రూ. 30 లక్షలతో మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మనోహర్ కోసం చెన్నై, బెంగళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఊహించని ప్రైజ్‌తో దక్కించుకుంది. ఈ యువ ప్లేయర్ కోసం హైదరాబాద్ జట్టు రూ. 3.20 కోట్లు ఖర్చు చేసింది.

కాగా, 2024 మహారాజా ట్రోఫీలో ఈ 30 ఏళ్ల బ్యాటర్ టోర్నమెంట్‌లో 84.50 సగటుతో 507 పరుగులు చేశఆడు. 196.51 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *