Secunderabad Serial killer: సికింద్రాబాద్ సీరియల్‌ కిల్లర్‌.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు

Secunderabad Serial killer: సికింద్రాబాద్ సీరియల్‌ కిల్లర్‌.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు


Secunderabad Serial killer: సికింద్రాబాద్ సీరియల్‌ కిల్లర్‌.. వెలుగులోకి ఒళ్లు గగుర్పోడిచే విషయాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 29: ఒంటరి మహిళలు రైల్లో ప్రయాణం చేస్తున్నారా అయితే అలెర్టగా ఉండండి. ట్రైన్‌లలో ఒంటరిగా ఉన్న మహిళలే అతడి లక్ష్యం.. గొంతు నులిమి చంపి ఒంటి మీద ఉన్న బంగారు నగలు దోచుకెళ్ళడం అతడి నైజాం.. అతడో సైకో కిల్లర్.. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు.. జైలు నుంచి విడుదలైన 11 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హరియాణాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ భోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ (29) ఆరాచకానికి కర్ణాటక లోని యాద్గిరి రైల్వే స్టేషన్ లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. రాహుల్ జాట్ అయిదో ఏట పోలియో బారిన పడటంతో ఎడమకాలికి వైకల్యం ఏర్పడింది. 2018-19లో అతనిపై ట్రక్ దొంగతనం, ఆయుధాల రవాణాపై రాజస్థాన్, హరియాణా, యూపీ, ఉత్తరాఖండ్ లో కేసులున్నాయి.

ఓ కేసులో జోద్పూర్ పోలీసులు అతన్ని జైలుకు పంపారు. విడుదలయ్యాక ఈ నెల 14న ఉద్వాడలో పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యువతి(19)ని మామిడితోటలోకి లాక్కెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు. సైకో కిల్లర్ హత్య చేయాలనుకున్నప్పుడు రైలెక్కుతాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. అక్టోబరులో మహరాష్ట్ర సోలాపూర్ స్టేషన్లో మహిళను, కైతర్ ఎక్స్ ప్రెస్లో ఓ వృద్ధుడిని, హౌరా స్టేషన్ సమీపంలో హతమార్చాడు. కర్ణాటకలోనూ ఓ ప్రయాణికురాలిని హత్య చేశాడు. పుణె-కన్యా కుమారి ఎక్స్ ప్రెస్ లోనూ ఓ మహిళతో మాటలు కలిపి గొంతుకుతాడు బిగించి చంపేశాడు. వరుస హత్యలతో అప్రమత్తమైన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్ పోలీసులు హంతకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.గుజరాత్లోని ఉద్వాడ స్టేషన్ సమీపంలో ఓ యువతి హత్యాచారం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతదేహం సమీపంలో ఒక సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో దుస్తులు, తాడు, కత్తిని గుర్తించారు. చుట్టుపక్కల స్టేషన్లలోని 5 వేల సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఉద్వాడ స్టేషన్ లో అనుమానితుడి గుర్తించి, అతడి ఫొటోను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు పంపారు.

సికింద్రాబాద్‌ రైలులో మరణించిన మృతురాలు ఎవరంటే?

కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కుటుంబం ఉపాధి కోసం కర్ణాటక చేరింది. హైదరాబాద్ లో ఉన్న పెద్ద కూతురుని చూసేందుకు తోర్నగల్ రైల్వే స్టేషన్లో ఈ నెల 23న రాత్రి బెల్గావి-మణగూరు ఎక్స్ ప్రెస్ ఎక్కారు. మరుసటి రోజు ఉదయం అత్తను తీసుకొచ్చేందుకు వెళ్లిన వెంకటేశ్ దివ్యాంగుల కోచ్ లో రమణమ్మ మరణించి ఉండటం గమనించాడు.కేసు నమోదు చేసిన రైల్వేపోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాద్గిరి స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెను టవల్ గొంతునులిమి హతమార్చిన తరువాత గుజరాత్ లోని వాపి స్టేషన్ చేరినట్టు గుర్తించారు. మృతురాలి ఫోన్ బెంగళూర్ లో స్విచ్చాఫ్ చేసినట్టు నిర్దారించారు. అక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న సమయంలో ప్లాట్‌ ఫాంపై కుంటుతూ నడుస్తున్న రాహుల్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు సికింద్రాబాద్ రైల్వేపోలీసులు గుజరాత్ వెళ్లనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *