Sandeep Raj: తిరుమల శ్రీవారి సాక్షిగా.. నటితో ఏడడుగులు నడిచిన కలర్ ఫొటో డైరెక్టర్.. హాజరైన సుహాస్, హర్ష

Sandeep Raj: తిరుమల శ్రీవారి సాక్షిగా.. నటితో ఏడడుగులు నడిచిన కలర్ ఫొటో డైరెక్టర్.. హాజరైన సుహాస్, హర్ష


కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం శనివారం (డిసెంబర్ 07) తిరుమలలో ఘనంగా జరిగింది. తన తొలి సినిమా కలర్ ఫొటోలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో కలిసి సందీప్ ఏడడుగులు నడిచారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇవాళ తిరుమల శ్రీవారి సాక్షిగా ఏకమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందీప్ రాజ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. సందీప్ రాజ్ తొలి సినిమా హీరో సుహాస్ సతీసమేతంగా ఈ వివాహ వేడుకకు హాజరయ్యాడు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించాడు. అలాగే కలర్ ఫొటో సినిమాలో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన వైవా హర్ష కూడా సందీప్ రాజ్ పెళ్లిలో సందడి చేశాడు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పెళ్లి కొడుకు సందీప్ రాజ్ విషయానికి వస్తే..షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత కలర్ ఫొటో సినిమాతో దర్శకుడిగా మారాడు. కరోనా కారణంగా ఓటీటీలో రిలీజైనా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు, సిరీస్ లకు రచయితగా పనిచేస్తూనే సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాలతో మోగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎంగేజ్ మెంట్ వేడుకలో సందీప్ రాజ్, చాందినీ చౌదరి..

ఇక వధువు చాందినీ రావు విషయానికి వస్తే.. కలర్ ఫొటో సినిమాతో  పాటు డైరెక్టర్ సందీప్ రాజ్ కథ అందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర చేసింది. అలాగే ‘రణస్థలి’తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించిందీ అందాల తార. అయితే కలర్ ఫొటో షూటింగ్ సమయంలోనే సందీప్, చాందినీల మధ్య ప్రేమ చిగురించింది. కొద్దిరోజుల క్రితం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరూ తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు.

నటి చాందినీ రావుతో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *