కమర్షియల్ సినిమా అర్ధం మారింది.. పెర్ఫార్మన్స్ రోల్స్‌పైనే హీరోల ఫోకస్

కమర్షియల్ సినిమా అర్ధం మారింది.. పెర్ఫార్మన్స్ రోల్స్‌పైనే హీరోల ఫోకస్


కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుందా లేదంటే మన హీరోలే కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా..? ఒకప్పుడు చొక్కా నలక్కుండా 100 మందిని ఎగరేసి కొట్టినోళ్లే.. ఇప్పుడు ఒక్కో పాత్ర కోసం అలా నలిగిపోవడానికి కారణమేంటి..? మార్పు మొదలైందా లేదంటే మారకపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా..? అసలేం జరుగుతుంది..?

టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుంది. అర్థం పర్థం లేని కథల కంటే.. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నారు మన హీరోలు. అలాంటి కథలకే తమ నటనతో కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా మన హీరోలు మాస్ రగ్డ్ కారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. రంగస్థలం నుంచి ఈ ట్రెండ్ మొదలైంది.

రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో రంగస్థలం లాంటి సినిమా సుకుమార్ అనౌన్స్ చేసినపుడు షాక్ అయ్యారంతా. కానీ సినిమా విడుదలయ్యాక.. తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ షాక్ అయ్యేలా చేసాడు సిట్టిబాబు. సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ తగ్గలేదు. ఆ తర్వాత పుష్ప కోసం అల్లు అర్జున్‌ను అలాగే మార్చేసారు లెక్కల మాస్టారు. పుష్పతో బన్నీకి ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. తాజాగా పుష్ప 2లోనూ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే పూనకాలు పుట్టించాడు. ఇదే రూట్‌లోనే మిగిలిన హీరోలు వెళ్తున్నారు. గతేడాది దసరాతో నాని ఇదే మ్యాజిక్ చేసారు. తాజాగా శ్రీకాంత్ ఓదెలతో చిరు ఇలాంటి మాస్ సినిమానే అనౌన్స్ చేసారు. మొత్తానికి ఈ మార్పు మంచికే అంటున్నారు ఆడియన్స్.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *