World Chess Championship 2024: సింగపూర్‌లోని రిసార్ట్స్ వరల్డ్ సెంటోసాలోని అక్వేరియస్ హోటల్లో 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 11వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా భారతదేశానికి చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ టైటిల్‌కు చేరువయ్యాడు.
సింగపూర్‌లో జరుగుతోన్న ఛాంపియన్షిప్ 11వ మ్యాచ్‌లో తెల్లటి పావులతో ఆడుతున్న గుకేశ్ 29 ఎత్తుగడల్లో డింగ్‌ను ఓడించి టైటిల్ రేసులో 1 పాయింట్‌తో అగ్రస్థానంలో నిలిచాడు.
దీనికి ముందు, గుకేశ్, లిరెన్ మధ్య వరుసగా ఏడు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. కానీ, భారత గ్రాండ్‌మాస్టర్ లిరెన్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకుని చైనా ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాడు.
ఇద్దరు ఆటగాళ్ల మధ్య మొత్తం 11 గేమ్‌లలో ఎనిమిది గేమ్‌లు డ్రా అయ్యాయి. గుకేశ్ రెండు గేమ్‌లు గెలవగా, చైనా ఆటగాడు లిరెన్ ఒక గేమ్‌ను గెలుపొందింది. ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లు వరుసగా 6, 5 పాయింట్లు సాధించారు.
కేవలం 18 ఏళ్ల వయసున్న గుకేష్‌కు అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించే అవకాశం ఉంది. గుకేశ్ 1 మ్యాచ్ గెలిచి, మిగిలిన 3 గేమ్‌లను డ్రా చేసుకుంటే, అతను ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని పొందుతాడు.