మహాభారతంలో పరీక్షిత్తు రాజును కాటు వేసిన అరుదైన పాము ప్రత్యక్షం..! అద్భుతమైన వీడియో వైరల్

మహాభారతంలో పరీక్షిత్తు రాజును కాటు వేసిన అరుదైన పాము ప్రత్యక్షం..! అద్భుతమైన వీడియో వైరల్


జార్ఖండ్‌లో అరుదైన పాము కనిపించింది. మహాభారతంలో చెప్పబడిన తక్షక నాగుడు కలియుగంలో ఆశ్చర్యకరంగా కనిపించాడు. రాంచీలోని ప్రభుత్వ కార్యాలయంలో కనిపించిన ఈ పామును చూసి అధికారులు నివ్వెరపోతున్నారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జార్ఖండ్‌లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని పాముల సంరక్షణా నిపుణుడు తెలిపారు. ఈ పాము చాలా విషపూరితమైనదని చెప్పారు. ఇక్కడ కనిపించిన పాము వయస్సు 12 ఏళ్లు అని గుర్తించారు. తక్షక్ నాగ రూపమే అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో, పాము శరీరం బంగారు ఆభరణంలా మెరుస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం తక్షక్ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అదే సమయంలో ఈ అరుదైన నాగ చరిత్ర తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

తక్షక్‌ ప్రస్తానం.. ద్వాపర యుగం ముగింపులో భారతదేశాన్ని పరీక్షిత్తుడు అనే రాజు పరిపాలించాడు. అతను మహాభారతంలో పాము కాటుకు గురై మరణించినట్లు పురాణాలలో పేర్కొనబడింది. తక్షకుడు నాగ వంశానికి చెందినవాడని చెబుతారు. ఈ పాము వందల సంవత్సరాలు జీవిస్తుంది. ఎక్కువగా చెట్లపై నివసిస్తుంది. ఇది వంద అడుగుల గాలిలో ఎగురుతుందని చెబుతున్నారు. ఇది దట్టమైన అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *