Director Sukumar: సుకుమార్ పై రాప్ సాంగ్ అదిరిపోయింది.. పుష్ప 2 కోసం సుక్కు కష్టం చూశారా..?

Director Sukumar: సుకుమార్ పై రాప్ సాంగ్ అదిరిపోయింది.. పుష్ప 2 కోసం సుక్కు కష్టం చూశారా..?


ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏కు వరల్డ్ వైడ్ భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు రూ.829 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా యాక్టింగ్ పై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రీమియర్స్ నుంచి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ చూసి సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సుకుమార్.

ఈ సినిమాతో సుకుమార్ స్థాయి మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుండగా.. మరోవైపు సుకుమార్ పై చేసిన ఓ రాప్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అద్విత్ రెడ్డి ఈ పాటను సుకుమార్ కు ప్రెసెంట్ చేశారు. ఆయన దర్శకత్వం, ప్రతిభను.. అలాగే ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ.. వీడియో రూపంలో ఓ రాప్ సాంగ్ రిలీజ్ చేశారు. పుష్ప సినిమాకు సంబంధించిన లొకేషన్స్ మూమెంట్స్ చూపిస్తూ.. ఆయన కంటెంట్ బలాన్ని హైలెట్ చేస్తూ ఈ పాటలో సుక్కు కష్టాన్ని చూపించారు. సుకుమార్ సార్ మీరు ఓ మాన్ స్టర్ అంటూ రాసుకున్న లైన్స్ ఈ పాటలో హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రాప్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

పుష్ప సినిమా కోసం సుకుమార్ ఎంతగా కష్టపడ్డారు అనే విషయాలను వీడియోలో చూపించారు. ఈ పాటను చరణ్ ఆలపించగా.. పవన్ మ్యూజిక్ అందించారు. సుకుమార్ పై రాసిన రాప్ సాంగ్ ఒకసారి మీరు వినేయండి.



ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *