ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయినా ముద్దగుమ్మలు చాలా మంది ఉన్నారు. అయితే సినిమా సక్సెస్ అయితే హీరోయిన్స్ కు క్రేజ్ వస్తుంది. కానీ ఈ అమ్మడి మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.
ఆమె భాగ్యశ్రీ. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ దక్కించుకుంది.
ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాకముందే ఆఫర్లు దక్కించుకుందీ బ్యూటీ. ఇప్పటికే పలువురు మేకర్స్ భాగ్యశ్రీ డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రామ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా హిట్ అయితే భాగ్యశ్రీటాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయం.
దాంతో ఈ చిన్నది ఆశలన్నీ రామ్ సినిమా పైనే పెట్టుకుంది. అలాగే ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాలోనూ అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది తన స్టన్నింగ్ ఫొటోలతో కవ్విస్తుంది.