Diabetes Drink: మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

Diabetes Drink: మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!


మధుమేహం ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది.. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిక్ నియంత్రణలో ఆహారం, జీవనశైలిపై ఎక్కువ శ్రద్ధ అవసరం. మధుమేహంతో జీవించడం అంత సులభం కానప్పటికీ, కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా దీనిని కొంతవరకు నియంత్రించవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు బార్లీ వాటర్ అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ రిఫ్రెష్ పానీయం సహజంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గించడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బార్లీలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, బార్లీని తిన్న టైప్ 2 డయాబెటిస్ రోగులు తెల్ల బియ్యం తినే వారి కంటే మూడు గంటల తర్వాత పరీక్షించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. బార్లీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని భావిస్తున్నారు. బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు.  ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఇది చాలా మంచిది.

ఇది కడుపు సమస్యలకు ఇంటి నివారణగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు ఒక రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *