Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?


ఈ ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది దేశం. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2025న బ్యాంకులకు సెలవు సెలవు ఉంటుందా? లేదా? జనవరిలో పండుగ, ప్రాంతీయ, జాతీయ సెలవులతో సహా అనేక సెలవులు ఉన్నాయి. అన్ని బ్యాంకులు (పబ్లిక్, ప్రైవేట్) కొత్త సంవత్సరం మొదటి నెలలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవులు పాటిస్తాయి. అయితే బ్యాంకు సెలవుల షెడ్యూల్‌లు రాష్ట్రాల వారీగా మారతాయని గమనించాలి. అందుకే మీ స్థానిక శాఖలో చెక్-ఇన్ చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం.

కొత్త సంవత్సరం రోజున బ్యాంకులు మూసి ఉంటాయా?

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1, 2025న దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే మిజోరాం, సిక్కిం రాష్ట్రాలలోని బ్యాంకులు నూతన సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 31, 2024న మూసి ఉండనున్నాయి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు:

కొత్త సంవత్సరంలో బ్యాంకులు మూసి ఉండవచ్చు. కానీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇతర సెలవులతో సంబంధం లేకుండా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణల కోసం ఏదైనా బ్యాంక్ ATMలను కూడా పని చేస్తాయని గుర్తించుకోండి.
ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక సెలవు క్యాలెండర్‌ను ప్రకటిస్తుంది. సెలవు జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు ఆర్బీఐ జాతీయ, స్థానిక సందర్భాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెలవు జాబితాను ప్రకటించింది. ఇది అన్ని ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం చేయబడింది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాను ఆర్‌బిఐ ఇంకా విడుదల చేయలేదు.

ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్‌ స్టోరీ

జనవరి 2025 బ్యాంక్ హాలిడే జాబితా:

జనవరి 2025కి సంబంధించి ఆర్‌బిఐ ఇంకా అధికారిక క్యాలెండర్‌ను ప్రకటించలేదు. అయితే బ్యాంకులు రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవుతో సహా నెలలో 13 పని చేయని రోజులు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *