Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ కథ వినగానే ఆ సంఘటనలే గుర్తుకొచ్చాయి: దిల్ రాజు

Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ కథ వినగానే ఆ సంఘటనలే గుర్తుకొచ్చాయి: దిల్ రాజు


రాజమండ్రి వేదికగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ అంజలి, నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. శంకర్ గారు ఈ కథను చెప్పినప్పుడు మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్ చరణ్ గారు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నామ’ ని అన్నారు.

కాగా ఇదే కార్యక్రమానికి హాజరైన అంజలి మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈవెంట్ జరుగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడి నుంచే వెళ్లి హీరోయిన్‌గా మారి.. మళ్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారెతో వకీల్ సాబ్‌లో పని చేశాను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ రోజు మాకోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. నటిగా డిఫరెంట్ పాత్రలను చేయాలని అందరికీ ఉంటుంది. నా తల్లి పేరు పార్వతి. ఈ చిత్రంలో నేను పోషించిన కారెక్టర్ నేమ్ పార్వతి. నాకు ఈ కారెక్టర్ చాలా టచ్ అయింది. నాకు ఇంత మంచి పాత్రను రాసిన, ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న మూడో చిత్రమిది. తమన్ సంగీతం బాగుంది. ఈ రోజు ఇక్కడ వినబోయే సాంగ్ నాకు చాలా స్పెషల్. రామ్ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఇక్కడకు వచ్చిన ఆడియెన్స్, అభిమానులకు థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.

గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో దిల్ రాజు స్పీచ్..



ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *