Money Astrology 2025: శుభ గ్రహాల అనుకూలత.. సంక్రాంతి తర్వాత వారికి డబ్బే డబ్బు..!

Money Astrology 2025: శుభ గ్రహాల అనుకూలత.. సంక్రాంతి తర్వాత వారికి డబ్బే డబ్బు..!


ఈ ఏడాది సంక్రాంతి నుంచి, అంటే జనవరి 15 తర్వాత నుంచి అయిదు రాశుల వారికి ఆర్థికంగా దశ తిరగడం ప్రారంభిస్తుంది. సంపద, సౌభాగ్యాలకు సంబంధించిన కలలు నిజం కావడం జరు గుతుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపట్టడానికి, రావలసిన సొమ్మును రాబట్టుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి సమయం అనుకూలంగా మారడం జరుగుతుంది. అనేక అవరోధాలు, ఆటంకాల నుంచి బయటపడడంతో పాటు, కనీ వినీ ఎరుగని రీతిలో ఆర్థిక విజయాలు సాధించే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, కుంభ రాశుల వారి జీవితాలు, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

  1. వృషభం: శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా ఆర్థిక విజయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంత కాలంగా పడుతున్న ఆర్థికపరమైన కష్టనష్టాల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆశ్చర్యకరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టు బడులు పెట్టి ఆర్థిక లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
  2. మిథునం: గ్రహ బలం పెరుగుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారి జీవితాల్లో అనేక మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆటంకాలను, అవరోధాలను అధిగమిస్తారు. ఆదాయ ప్రయ త్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక భద్రత, వ్యక్తిగత పురోగతి మీద దృష్టి పెడతారు. ఆదాయాన్ని అంచనాలకు మించి వృద్ధి చేసుకోవడానికి అనేక మార్గాలను అనుసరించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశులకు ధన సంబంధమైన గురు, శుక్రుల బలం బాగా ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధికి గత ఏడాది చేసిన ప్రయత్నాలన్నీ ఈ ఏడాది సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. సాధారణంగా కోరు కున్నదల్లా చేతికి అందుతుంది. ఆర్థిక అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు చేస్తూనే వ్యాపారాలు కూడా చేసే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధికంగా లాభాలు పొందు తారు. వ్యక్తిగతంగానే కాకుండా, వృత్తిపరంగా కూడా బాగా పురోగతి సాధించడం జరుగుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశివారి ఆలోచనలు, ప్రయత్నాలు చాలావరకు మారిపోతాయి. కొత్త ప్రాధాన్యాలు ఏర్పడ డానికి అవకాశం ఉంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పొందుతారు. సంపద వృద్ధికి, భోగభాగ్యాలకు సంబంధించిన కలలు సాకా రమవుతాయి. జీవన శైలి చాలావరకు మారిపోతుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది.
  5. కుంభం: గురు, శుక్రుల వంటి ధన కారక గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల కొత్త ఏడాదంతా ఈ రాశివారికి చిరస్మరణీయ సంవత్సరంగా మారిపోతుంది. ఈ రాశివారి ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి. భారీ జీతభత్యాలతో దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు అందు తాయి. అనుకున్న ఆశలు, కోరికలు నెరవేరుతాయి. ప్రతి అవకాశాన్నీ అంది పుచ్చుకుంటారు. సిరిసంపదలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *