US Winter Storm 2025: అమెరికాలో మంచు తుపాను బీభత్సం, ఐదుగురు మృతి, 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..

US Winter Storm 2025: అమెరికాలో మంచు తుపాను బీభత్సం, ఐదుగురు మృతి, 63 మిలియన్ల ప్రజలపై ప్రభావం..


అమెరికాలో సోమవారం నుంచి మంచు తుపాను బీభత్సం సృష్టిస్తునే ఉంది. ఈ తుఫాను ప్రభావం మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు కనిపించింది. మంచు తుఫానులు, హిమపాతం, తుఫానులు, చలటి గాలులు చలిని మరింత తీవ్రతరం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భారీ హిమపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వాతావరణ శాఖ కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సాస్, అర్కాన్సాస్, మిస్సోరీ రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. అయితే సాధారణంగా వెచ్చగా ఉండే ఫ్లోరిడాలో కూడా భారీ హిమపాతం కురుస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ కాన్సాస్, మిస్సౌరీలకు సుడిగాలి హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా ఇంటర్‌స్టేట్ 70కి ఉత్తర ప్రాంతాలలో కనీసం 8 అంగుళాల హిమపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో ఈ మార్పు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అంతేకాదు విమాన ప్రయాణంపై కూడా ప్రభావం చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మంచు తుఫాను కారణంగా భారీ నష్టం

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. వెయ్యికి పైగా వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయని.. 356 ప్రమాదాలు జరిగాయని, 31 మంది గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ తుఫాను కారణంగా అమెరికాలో 5 మంది మరణించారు. మిస్సౌరీలో ఒక డంప్ ట్రక్కు మంచుతో కప్పబడిన రహదారిపై నుంచి జారి.. ఒక వ్యక్తిపైకి వెళ్ళింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కాన్సాస్‌లోని సెడ్‌విక్ కౌంటీలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

హిమపాతం కారణంగా హైవేలు మూసివేత

కాన్సాస్, పశ్చిమ నెబ్రాస్కా , ఇండియానాలోని కొన్ని ప్రధాన రహదారులు భారీ మంచుతో కప్పబడి ఉన్నాయి. అనేక వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు నేషనల్ గార్డ్‌లను రహదారులపై మోహరించారు. “ఈ హిమపాతం ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం” అని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు ఆ దేశ వాతావరణ శాఖ అధికారి ఒరావెక్ ప్రకారం ఈ మంచు తుఫాను సమయంలో 63 మిలియన్ల అమెరికన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *