BSNL Plan: మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఉచిత కాల్స్‌, డేటా.. షరతులు వర్తిస్తాయ్‌.. ఎవరికో తెలుసా?

BSNL Plan: మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఉచిత కాల్స్‌, డేటా.. షరతులు వర్తిస్తాయ్‌.. ఎవరికో తెలుసా?


ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరల కోసం చూస్తున్న వారు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అనేక చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో డేటా, కాలింగ్‌తో పాటు, దీర్ఘ కాల వ్యాలిడిటీ ప్రయోజనం కూడా ఉంది. అత్యంత చౌకైన ప్లాన్‌ గురించి తెలుసుకుందాం. ఇందులో కంపెనీ ఒక సంవత్సరం చెల్లుబాటుతో పాటు డేటా, కాలింగ్‌ను అందిస్తోంది.

BSNL రూ. 321 ప్లాన్

ప్రభుత్వ టెలికాం కంపెనీ కేవలం రూ.321కే ఏడాది చెల్లుబాటును ఇస్తోంది. అంటే రూ.321కి యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అంతేకాదండోయ్‌.. ప్రతి నెలా ప్లాన్‌లో 15GB డేటా, ఉచిత కాలింగ్, 250 SMSలు కూడా అందుబాటులో ఉన్నాయి. రోజుకు రూ. 1 కంటే తక్కువ ధరతో పొందవచ్చు. కానీ ఇది అందరికి అనుకుంటే పొరపాటే. మరి ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసా..? ఈ ఆఫర్ తమిళనాడు పోలీసులకే చెల్లుబాటు కావడం గమనార్హం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాన్‌లో కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఫోన్‌ నంబర్లకు మాత్రమే ఏడాది పాటు ఉచితం. ఇతర నెట్‌వర్క్‌ నెంబర్లకు కాల్‌ చేయాలంటే నిమిషానికి 7 పైసలు, ఎస్టీడీ కాల్‌లకు నిమిషానికి 15 పైసలు చొప్పున వసూలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రూ.2,399 ప్లాన్‌:

నూతన సంవత్సరం సందర్భంగా రూ.2,399 ప్లాన్‌లో లభించే ప్రయోజనాలను BSNL పెంచింది. ఇప్పుడు కంపెనీ 395 రోజులకు బదులుగా 425 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. అదేవిధంగా 790GB డేటాకు బదులుగా, 850GB డేటా అందిస్తోంది. ఈ ప్రయోజనాలను పొందడానికి కస్టమర్‌లు ఎలాంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ జనవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు జనవరి 16లోపు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు ఈ రీఛార్జ్ చేసిన తర్వాత మీరు 2025లో మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.

రూ. 277 ప్లాన్‌:

న్యూ ఇయర్ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ మరో ఆఫర్‌ను విడుదల చేసింది. ఇందులో రూ.277 రీఛార్జ్ చేసుకుంటే 120జీబీ ఉచిత డేటా, అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగదారులు పొందుతున్నారు. ఈ ఆఫర్ జనవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *