Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్

Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్


సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట. సరదాల గుట్ట. జ్ఞాపకాల తేనె తుట్టె. ప్రతి ఏటా వచ్చినా, సంక్రాంతి మనల్ని కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది. పెద్ద పండుగ కదా…సంబరాలు కూడా పెద్దవే. అన్ని పండుగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కోనసీమ,గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు నెక్ట్స్‌ లెవెల్‌. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల హడావుడి పండగ సందడిని ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. కాగా వైభవంగా జరుపుకునే పండుగ కాబట్టే.. సంక్రాంతికి తెలంగాణ కంటే ఏపీలోని ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చారు. ఇది విద్యార్థులకు పండుగలాంటి న్యూసే.  జనవరి 11 నుంచి 17 వరకు మొత్తం ఏడు రోజులు పండుగ సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం… విద్యాసంస్థలకు 10 రోజులు సెలవులు ప్రకటించింది.  జనవరి 10 నుంచి 19 వరకు.. అంటే 10 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జనవరి 20న సోమవారం తిరిగి పాఠశాలలు రీ స్టార్ట్ అవుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి  తెలిపారు. సెలవులు తగ్గించనున్నారని సామాజిక మధ్యమాల్లో ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం సెలవులపై క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలో  పెద్ద పండుగ కావడంతో.. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా దేశ విదేశాల్లో స్థిర పడిన వారంతా పండక్కు సొంతూర్లకు పయనమయ్యారు. చాలా చోట్ల గెట్ టూ గెదర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక 2025 అకడమిక్ ఇయర్ సెలవుల జాబితా కూడా.. ఇటీవలే విడుదల చేశారు. దఆ ప్రకారం 2025లో మొత్తం 23 సాధారణ, 21 ఆప్షనల్‌ హాలిడేస్ ఉన్నాయి.  అయితే రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం వంటి పండుగలు ఆదివారం రోజున వచ్చాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *