Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్.. కొండ దేవర సాంగ్ వచ్చేసింది..

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్.. కొండ దేవర సాంగ్ వచ్చేసింది..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇన్నాళ్లు తమిళంలో వరుస హిట్ మూవీస్ తెరకెక్కించిన శంకర్ తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు అటు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు టీజర్, ట్రైలర్ మూవీపై హైప్ పెంచేశాయి. ఇందులో తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరపడడంతో గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా కొండ దేవర పాటను విడుదల చేశారు. “నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర” అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. తమన్, శ్రావణ భార్గవి పాడారు. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చరణ్ సరసన మరోసారి కియారా అద్వాని నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. అందులో అప్పన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.



ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *