Sanju Samson: టీమిండియా రమ్మంది.. సొంత జట్టు కేరళ వద్దంది.. శాంసన్ వివాదంలో ట్విస్ట్ ఏంటంటే?

Sanju Samson: టీమిండియా రమ్మంది.. సొంత జట్టు కేరళ వద్దంది.. శాంసన్ వివాదంలో ట్విస్ట్ ఏంటంటే?


Sanju Samson Controversy: ప్రపంచంలోని ప్రతి జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో సంజూ శాంసన్ ఉండాలని కోరుకుంటుంది. శాంసన్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుంది. అతను క్రీజులో కొనసాగితే ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు గల్లంతు అవుతాయి. కానీ, కేరళ జట్టు ఈ ఆటగాడిని జట్టులో ఉంచేందుకు ఇష్టపడడం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విజయ్ హజారే ట్రోఫీలో సంజూ శాంసన్ ఆడకపోవడానికి కారణం ఇదే. సంజూ శాంసన్‌పై షాకింగ్ న్యూస్ వచ్చింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ అతన్ని జట్టులోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఓ వైపు ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఇతర ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండగా.. మరోవైపు ఈ టోర్నీలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వలేదు.

శాంసన్, కేరళ క్రికెట్ మధ్య వివాదం..

మీడియా కథనాలు నమ్మితే, విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నాడు. అతను కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు తన లభ్యత గురించి మెయిల్ కూడా పంపాడు. అయినప్పటికీ, అతను జట్టులో ఎంపిక కాలేదు. విజయ్ హజారేలో ఆడాలంటే సంజూ శాంసన్ తప్పుకున్న టీమ్ క్యాంప్‌లో చేరడం తప్పనిసరి అని కేరళ క్రికెట్ అసోసియేషన్ గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి KCA మరో కారణం చెప్పింది. విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కేరళ క్రికెట్ అసోసియేషన్ కోరుతోంది.

నెలకు పైగానే అవుతోంది..

సంజూ శాంసన్ తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్‌ను డిసెంబర్ 3, 2024న ఆడాడు. నెల రోజులు దాటినా ఈ ఆటగాడు ఇంకా మైదానంలోకి రాలేదు. 2025 సంవత్సరం ప్రారంభమై 14 రోజులు గడిచినా శాంసన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కు టీమిండియాలో చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌లో శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్ రెండు సెంచరీలు సాధించాడు. అతను డర్బన్, జోహన్నెస్‌బర్గ్‌లలో సెంచరీలు సాధించాడు. శాంసన్ ఫామ్ బాగానే ఉంది. కానీ, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ముందు విజయ్ హజారేలో ఆడే అవకాశం అతనికి లభించి ఉంటే, అతని ఫామ్ మెరుగ్గా ఉండవచ్చు. కానీ, KCAతో అతని వివాదం దీనిని అనుమతించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కో సం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *