Manchu Manoj: ‘మీరిక్కడ ఉండొద్దు..’ మంచు మనోజ్‌కు పోలీసుల సూచన

Manchu Manoj: ‘మీరిక్కడ ఉండొద్దు..’ మంచు మనోజ్‌కు పోలీసుల సూచన


తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర బుధవారం జరిగిన ఘటనపై మంచు మనోజ్‌ స్పందించారు. గొడవలు సృష్టించడం తన ఉద్దేశం కాదన్నారు. తమ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం, వారిని బెదిరించడంతోనే వివాదం జరిగిందని చెప్పారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న తమను సంక్రాంతి జరుపుకోకుండా చేశారని ఆరోపించారు. ఇక.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ఎలాంటి ఫ్యామిలీ విషయాలు చర్చించలేదని తెలిపారు. అలాగే.. తనకు హెల్ప్‌ చేయాలని కూడా ఎవరినీ అడగలేదన్నారు మంచు మనోజ్‌. తాజాగా  తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా..  శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని మనోజ్‌కు పోలీసులు సూచించారు.

బుధవారం మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు మంచు మనోజ్ దంపతులు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోనికి పంపించేందుకు నిరాకరించారు. అదే సమయంలో కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా తాము కూడా అనుమతించలేమన్నారు పోలీసులు. గేటు తీయాలంటూ చాలాసేపు వర్సిటీ ఎదుటే నిరీక్షించారు మనోజ్ దంపతులు. అప్పటికే చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్‌. యూనివర్సిటీకి వస్తున్నానని తెలిసి కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్లకు భయపడే పరిస్థితి లేదన్నారు. కేవలం పోలీసుల మాట విని మాత్రమే వెళ్లిపోతున్నానని అన్నారు మనోజ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *