ఇప్పుడు సినిమాల్లో కంటెంట్ ఉంటే చాలు అది ఎంత పెద్ద హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ అయినా సినిమాలు మన దగ్గర కూడా మెప్పిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో 96 ఒకటి. తమిళ్ లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. అద్భుతమైన కథతో ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో తెరకెక్కింది. ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. అయితే తమిళ్ లో అప్పటికే పెద్ద హిట్ అవ్వడంతో చాలా మంది తమిళ్ లో చేసేశారు. దాంతో తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.
ఇది కూడా చదవండి : పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్
తెలుగులో జానుగా వచ్చిన ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే.. తన అందాలతో మతి పోగొడుతోంది ఆ ముద్దుగుమ్మ. ఓ రేంజ్లో గ్లామర్ షోతో కవ్విస్తోంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆ ముద్దుగుమ్మ పేరు గౌరీ కిషన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లోనే కాదు తెలుగు రీమేక్ లోనూ ఈ చిన్నదే నటించింది. గౌరి ప్రస్తుతం హీరోయిన్గా మూవీస్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది. శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా వెకేషన్స్ తోనే గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. బికినీలోనూ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి