Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను నిల్వ చేయడం ఎలా..?

Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను నిల్వ చేయడం ఎలా..?


పాలు ప్రతి ఇంట్లో కూడా చాలా అవసరం. టీ, కాఫీ తాగడం కోసం లేదా చిన్న పిల్లలకు ఇవ్వడానికి పాలను నిల్వ చేయడం అనివార్యం. సాధారణంగా ఫ్రిజ్‌లో ఉంచితే పాలు ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్ పాడైతే పాలను ఎలా భద్రపరచాలో తెలియక చాలా మంది బాధపడుతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి పాలను ఫ్రిజ్ లేకుండానే చెడిపోకుండా ఉంచుకోవచ్చు.

తక్కువ మంటపై పాలను మరిగించడం

ముందుగా పాలను బాగా మరిగించాలి. మరిగిన తర్వాత కూడా మూడు నుంచి నాలుగు నిమిషాలు తక్కువ మంటపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాలలో ఉన్న బ్యాక్టీరియాలు చనిపోతాయి. పాలు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. పాలు సరిగ్గా మరగనివ్వకపోతే అవి త్వరగా పాడవుతాయి.

చల్లగా ఉంచే ప్రదేశం ఎంచుకోవడం

పాలు మరిగిన తర్వాత అవి చల్లబరచి ఇంట్లో చల్లటి ప్రదేశంలో ఉంచాలి. వంటగదిలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలను అక్కడ ఉంచకూడదు. వెలుతురు తగలని, చల్లగా ఉండే ప్రదేశం ఎంచుకుంటే పాలు ఎక్కువసేపు చెడిపోకుండా ఉంటాయి.

మట్టి లేదా గాజు పాత్రలు ఉపయోగించండి

పాలను నిల్వ చేయడానికి స్టీల్ గిన్నెలు కాకుండా మట్టి లేదా గాజు పాత్రలు ఉపయోగించండి. ఇవి పాలను చల్లగా ఉంచి వాటిని పాడవ్వకుండా కాపాడుతాయి. ఫ్రిజ్ లేకపోతే మట్టి పాత్రలు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.

ఏసీ గది లేదా చల్లటి నీటి ఉపయోగం

మీ ఇంట్లో ఏసీ ఉంటే పాల గిన్నెను ఆ గదిలో ఉంచడం వల్ల అవి త్వరగా చెడిపోవు. లేకపోతే మూతపై ఐసుగడ్డలు పెట్టడం ద్వారా పాలు చల్లగా ఉంటాయి. పాలను నీటితో నిండిన పెద్ద పాత్రలో ఉంచినా కూడా అవి చల్లగా ఉండి పాడవ్వవు.

నీటితో పాలను రక్షించడం

పాలను చల్లటి నీటిలో నానబెట్టిన క్లాత్ తో కప్పి ఉంచండి. లేదా ఆ క్లాత్ ను పాల గిన్నె చుట్టూ చుట్టి ఉంచడం వల్ల పాలు చల్లగా ఉంటాయి. ఇలా చేస్తే గది ఉష్ణోగ్రత కారణంగా పాలు చెడిపోకుండా ఉంటాయి. ఈ సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా ఫ్రిజ్ లేకపోయినా పాలను సురక్షితంగా ఉంచవచ్చు. ఇక మీదట పాలు చెడిపోతాయేమోనని బాధపడకండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *