సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. మరికొంతమంది విలన్స్ గాను మారుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, ఇంద్రజ, స్నేహ, ఆమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ హీరోయిన్ మాత్రం వారికి విభిన్నంగా వెళ్తుంది. హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారింది. అంతే కాదు తొలి చిత్రానికే అంతర్జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ చాలా ఫెమ్స్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి దేవయాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో దేవయాని హీరోయిన్ గా చేశారు. అలాగే మహేష్ బాబు నటించిన నాని సినిమాలో ఆయన అమ్మగా చేశారు దేవయాని. ఇక ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత , జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ అమ్మగా చేశారు దేవయాని.
దేవయాని సినిమా ఇండస్ట్రీలో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న నటి. దర్శకుడు రాజ్‌కుమార్‌ను 2001లో ఆమె వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది. తమిళంలోనే 100కు పైగా చిత్రాల్లో కథానాయికగా కూడా నటించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవల దేవయాని దర్శకురాలిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దర్శకురాలిగా మొదటి అడుగుతోనే విజయాన్ని సాధించాడు. దేవయాని తొలిసారి దర్శకత్వం వహించి, నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘కైక్కుట్టై రాణి’ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకుంది.తొలి షార్ట్ ఫిలిం తోనే అవార్డు ఆ అందుకోవడంతో పలువురు నటీనటులు, అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు. ఈ కైకుట్టై రాణి చిత్రానికి ప్రముఖ స్వరకర్త ఇళయరాజా సంగీతం అందించారు. లెనిన్ సినిమాటోగ్రాఫ్‌లో తెరకెక్కిన ‘ది హ్యాండ్‌కర్చీఫ్ క్వీన్’ పిల్లల భావాలకు సంబందించిన కథతో తెరకెక్కింది.
So proud of you Akka 🥹👏🏼
Actress #Devayani’s directorial debut short film ‘Kaikuttai Rani’ wins award at the Jaipur International Film Festival#KaiKuttaiRani #HandkerchiefQueen @ilaiyaraaja #Lenin #Rajan #LakshmiNarayananAS #CSethu #AntonyBebin @onlynikil pic.twitter.com/6RVh395MqM
— Nakkhul (@Nakkhul_Jaidev) January 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.