Be Alert: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? చికెన్, మటన్ విషయంలో జాగ్రత్త..!

Be Alert: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? చికెన్, మటన్ విషయంలో జాగ్రత్త..!


Be Alert: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? చికెన్, మటన్ విషయంలో జాగ్రత్త..!

చికెన్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అసలు చికెన్ వండుతుంటే వచ్చే స్మెల్ కి నోరూరిపోతుంది అంతే. దీనితో చేసే రకరకాల వంటకాలకి తినకుండ అస్సలు ఉండలేము. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. తరచుగా చికెన్ తినడం ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయట. కొన్ని బ్లడ్ గ్రూప్‌ల వారికి చికెన్ తరచుగా తినడం తగ్గించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మిగతా వివరాలు తెలుసుకునే ముందు మీ బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే ఆహారం ఎలా నిర్ణయించుకోవాలో కూడా తెలుసుకుందాం.

బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం
మీ బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం తినడం ద్వారా శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. బ్లడ్ గ్రూప్‌ను అనుసరించి తినే ఆహారం శరీరానికి వేగంగా జీర్ణం అవుతుంది. చికెన్‌కి కూడా ఇది వర్తిస్తుంది. అందరూ చికెన్, మటన్‌ను సులభంగా జీర్ణించుకోలేరు. కొన్ని బ్లెడ్ గ్రూప్‌ల వారు మాంసాహారాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. అవి ఏ గ్రూప్ లో ఇప్పుడు తెలుసుకుందాం.

A బ్లడ్ గ్రూప్

A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల వారు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వీరి శరీరాలు మాంసాన్ని సులభంగా జీర్ణించలేవు. చికెన్, మటన్ వంటి ఆహారాలను వీరు తక్కువగా తినడం మంచిది. వీరి ఆహారంలో పచ్చి కూరగాయలు, వివిధ రకాల పప్పులు వంటివి ఉండాలి.

B బ్లడ్ గ్రూప్

B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ విషయంలో అదృష్టవంతులు. వీరు ఆహారంపై ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆకు కూరలు, పండ్లు, చేపలు, మటన్, చికెన్ వంటి ప్రతిదీ తినవచ్చు.

AB, O బ్లడ్ గ్రూప్

ఈ రక్త గ్రూప్‌ల వారు చికెన్, మటన్‌ను సమతుల్యంగా తినాలి. అంటే సమతులతను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని నివారించవచ్చు.

చికెన్ వల్ల వచ్చే ప్రమాదాలు

చికెన్ తరచుగా తినడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహార నియమాలను పాటించడం అవసరం. మీ బ్లడ్ గ్రూప్‌కు సరిపడే ఆహారాన్ని ఎంచుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *