పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఇతర పిల్లల కంటే బొద్దుగా ఉండాలని, అన్నింట్లో యాక్టీవ్‌గా ఉండాలని అనుకుంటారు. పిల్లలు ఇలా ఉండాలంటే వారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామన్నది చాలా ముఖ్యం.
ఆహారం అందించే విషయంలో పాలు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఎక్కువగా పాలే అందిస్తూ ఉంటాం. పాలు తాగడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతుంది. కింద పడినా.. త్వరగా విరిగిపోకుండా ఉంటాయి.
పిల్లలకు సరైన సమయంలో పాలు అందిస్తేనే వారి పెరుగుదల అనేది వేగంగా ఉంటుంది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకు పాలు అనేది ఇవ్వాలి. పరగడుపునే పట్టించినా గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కాబట్టి టిఫిన్ తిన్నాక ఇవ్వాలి.
అదే విధంగా రాత్రి నిద్రించే ముందు పాలు ఇవ్వాలి. ఈ పాటు పిల్లల ఎదుగుదలలో చక్కగా సహాయ పడతాయి. నిద్ర కూడా చక్కగా పట్టేలా చేస్తాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
అయితే పిల్లలకు వేడి పాలా లేక చల్లని పాలు ఇవ్వాలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. పిల్లలకు ఎప్పుడైనా సరే గోరు వెచ్చగా ఉండే పాలు పట్టించాలి. దీని వల్ల వారి త్వరగా జీర్ణం అవుతాయి.