తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని భాగ్యరేఖ బెదిరింపులకు దిగింది. బాధితులు భాగ్యరేఖ, ఆమె భర్త చంద్రశేఖర్‌లపై ఈనెల 22న ఎంవీపీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు భాగ్యరేఖని నకిలీ ఐ.ఎ.ఎస్.గా గుర్తించారు. ఫిర్యాదు అందిందని తెలియగానే వీరిద్దరూ పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు వద్ద అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకువచ్చారు. నిందితురాలు భాగ్యరేఖ గతంలో ఇలాగే కంచరపాలెం పరిధిలో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్
అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా
7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదట!