Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..


సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్‌ లభించింది. ఉదయనిధికి వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉరట లభించింది. ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాఖలైన మూడు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ పిటిషన్ల విచారణ అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

వాక్‌ స్వాతంత్ర్యం హక్కును ఉదయనిధి దుర్వినియోగం చేశారని , ఆయన వ్యాఖ్యలు ఎంతో మంది మనోభావాలను గాయపర్చాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే ఉదయనిధిపై చర్యలు తీసుకునేలా తమిళనాడు డీజీపీని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలని 2023లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో బీజేపీ సహా చాలా పార్టీల నేతలు, హిందూ సంఘాలు.. ఉదయనిధి స్టాలిన్‌పై, డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.

అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలు చేశారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని 3 రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా.. వాటిని విచారణ జరిపేందుకు సోమవారం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంగీకరించలేదు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *