దిన ఫలాలు (జనవరి 28, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు, లక్ష్యాల పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందల లభిస్తుంది. చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు, లక్ష్యాల పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లభ్ధి పొందుతారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా లాభాల పరంగా దూసుకుపోతాయి. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలి తాలనిస్తాయి. ప్రతి విషయంలోనూ సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పనిభారం, బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నా ముఖ్యమైన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నతో పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందు తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవ హారాలను కొద్ది శ్రమతో చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో మీ వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. మీ సలహాలు, సూచనలు విజయా లనిస్తాయి. ఆర్థికంగా రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలు కొద్దిగా తగ్గుతాయి. కొత్త ఉద్యోగు లకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవ కాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి చెందుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాట బాగా చెలామణీ అవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో రోజంతా సవ్యంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా కొద్దో గొప్పో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల్లో బాగా పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.